ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధం

YSRCP ,YCP campaign, Jagan election campaign,TDP, BJP, Jana Sena ,Pawan Kalyan, Chandrababu, Jagan,AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
YSRCP ,YCP campaign, Jagan election campaign, YCP,TDP, BJP, Jana Sena ,Pawan Kalyan, Chandrababu, Jagan,

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో.. సీఎం వైఎస్ జగన్ ప్రచారాలకు రంగం సిద్దం చేశారు. ఎన్నికల క్యాంపయిన్‌లో భాగంగా జిల్లాల పర్యటనలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఈ ఎన్నికల కోసం జగన్ స్పీచ్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ప్రచార పర్వంతో ప్రజల్లోకి దూసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్..ఈ నెలలోనే ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించబోతున్నారు.

సిద్ధం సభలతో పార్టీ కేడర్లో జోష్ నింపిన ఏపీ సీఎం..ఇప్పుడు తన రోజువారి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచడానికి.. విపక్షాలపై విమర్శల డోస్ పెంచానికి రెడీ అయిపోయారు. ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఏ ఏ నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు పర్యటించాలి… ఏ జిల్లాకు ఎప్పుడు వెళ్లాలి? అలాగే ఎక్కడ సభలు నిర్వహించాలి, ఎక్కడ రోడ్ షోలను ఏర్పాటు చేయాలనేదానిపై రూట్ మ్యాప్ ఇప్పటికే రెడీ అయింది.

దీని ప్రకారం ఒకే రోజు వేరు వేరు నియోజకవర్గాలలో సభలు నిర్వహించడానికి వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏపీలో కీలకమైన నియోజకవర్గాలను టచ్ చేయడానికి.. ఆ నియోజకవర్గాల్లో కచ్చితంగా జగన్ ప్రచారం ఉండే విధంగా ప్లాన్ రూపొందిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పాదయాత్ర చేసి 151 స్థానాల్లో విజయాన్ని సాధించిన వైసీపీ.. ఇప్పుడు వై నాట్ 175 నినాదాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్లబోతోంది.

ఎన్నికల కోసం రోజుకు రెండు నుంచి మూడు సభలతో పాటు రోడ్ షోలోనూ పాల్గొనడానికి ప్లాన్ చేస్తున్న వైసీపీ.. తాము గతంలో కైవసం చేసుకోలేకపోయిన నియోవర్గాలలో కూడా ఈసారి గెలవాలనే దానిపై దృష్టి పెడుతుంది. ఈ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూనే.. మరోవైపు పొత్తులతో వస్తున్న కూటమిని ఫేస్ చేయడానికి అస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు.

జగన్ తమ పర్యటనలో మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే నాడు-నేడు పేరుతో సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఏపీ ప్రజల్లోకి తీసుకెళ్లోబోతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వెనుక బాటుతనం, ఉత్తరాంధ్రలో వలసలు, ఉద్దానంలో తాగునీటి సమస్యలు, మేనిఫెస్టో హామీల అమలుపై ప్రధాన ఫోకస్ ఉంచబోతున్నారు. దీంతో పాటు సంక్షేమ పథకాలు, రైతులు, మహిళల కోసం అమలు చేసిన పథకాల గురించి వివరించబోతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 3 =