గాజువాకలో గెలవాలంటే చెమటోడ్చాల్సిందే..

YCP ,Jagan,TDP, Janasena, Pawan Kalyan,Gajuwaka, Chiranjeevi, Praja Rajyam Party, Chintalapudi Venkatramaiah, Palla Srinivasa Rao, Pawan Kalyan, Tippala Nagireddy, Varikooti Ramachandra Rao,Mango News Telugu,Mango News
YCP ,Jagan,TDP, Janasena, Pawan Kalyan,Gajuwaka, Chiranjeevi, Praja Rajyam Party, Chintalapudi Venkatramaiah, Palla Srinivasa Rao, Pawan Kalyan, Tippala Nagireddy, Varikooti Ramachandra Rao

ఏపీలో రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గంగా.. విశాఖపట్నం లోక్ సభ స్ధానం పరిధిలో ఉన్న గాజువాక గురించి చెబుతారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. గాజువాక ఏర్పడింది.అప్పటి నుంచి గాజువాకలో జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ  రాజకీయ పార్టీలకు మిశ్రమ ఫలితాలు ఇస్తూ హాట్ టాపిక్ గా నిలవడం ఈ నియోజవర్గం ప్రజల స్పెషాలిటీగా మారిపోయింది.  2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసి..ఓడిపోవడంతో ఈ నియోజకవర్గం పేరు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.

గాజువాక అసెంబ్లీ స్థానం రూరల్ నియోజకవర్గం.ఈ నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా కాపు, బీసీ సామాజిక వర్గాల హవా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. గాజువాక ,పెద గంట్యాడ మండలాలు ఈ అసెంబ్లీ సీటు పరిధిలోనే ఉన్నాయి.  నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత 2009లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో..చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చింతలపూడి వెంకట్రామయ్య విజయం సాధించారు

ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో   టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన పల్లా శ్రీనివాసరావుకు గాజువాక నియోజకవర్గ ప్రజలు విజయాన్ని అందించారు. కానీ 2019లో జరిగిన  ఎన్నికల్లో మాత్రం జనసేన నుంచి నిలబడ్డ పవన్ కళ్యాణ్ ను కూడా కాదని వైఎస్సార్సీపీ నుంచి బరిలో దిగిన తిప్పల నాగిరెడ్డిని గెలిపించారు.   ఇలా గాజువాక నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో.. మూడు పార్టీలు  గెలిచాయి. అప్పుడు టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో భారీగా ఓట్లు చీలిపోయి వైఎస్సార్సీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు. తిప్పల నాగిరెడ్డికి 84,645 ఓట్లు రాగా..  పవన్ కళ్యాణ్ కు 70,125 ఓట్లు లభించాయి. తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి పల్లా శ్రీనివాసరావుకు 56,642 ఓట్లు వచ్చాయి.

అయితే అప్పటికి, ఇప్పటికీ పరిస్థితులు మారాయి.  2019 ఎన్నికలతో పోలిస్తే రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌పై గెలిచిన తిప్పల నాగిరెడ్డికి  వైసీపీ అధిష్టానం ఈసారి సీటు ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో.. ఇక్కడ వరికూటి రామచంద్రరావుకు సీటును కేటాయించారు.ఇటు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ..  టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బరిలోకి  దిగుతున్నారు. ఒకవైపు వైసీపీ గ్రాఫ్  పడిపోవడంతో పాటు..టీడీపీ,  జనసేన కూటమి అభ్యర్థి బరిలో నిలబడటంతో..గాజువాక సీటు పల్లా శ్రీనివాసరావుకే అన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ గాజువాక నియోజకవర్గాన్ని జగన్ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటే మాత్రం.. వైఎస్సార్సీపీ వందకు వంద శాతం కష్టపడాల్సిందే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =