ఏలూరు కార్పోరేషన్ వైఎస్సార్సీపీ కైవసం, జూలై 30న మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక

2021 Eluru Municipal Corporation election, Andhra, Andhra’s Eluru municipal corporation poll counting, Eluru Municipal Corporation elections, Eluru Municipal Corporation elections counting, Eluru Municipal Election Results, Eluru Municipal Election Results 2021, Mango News, YSRCP Wins 47 Divisions in Eluru, YSRCP Wins 47 Divisions in Eluru Municipal Corporation Elections, YSRCP wins Eluru Municipal Corporation elections

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాలు ఇవ్వడంతో ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడించారు. ఏలూరులో మొత్తం 50 డివిజన్లలో మూడు డివిజన్లను వైఎస్సార్సీపీ ముందుగానే ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. దీంతో 47 డివిజన్లకి మార్చి 10, 2021న ఎన్నికలు జరిగాయి. 47 స్థానాలకు సంబంధించి తాజాగా చేపట్టిన ఓట్ల లెక్కింపులో 43 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. ఏకగ్రీవంతో కలిపి మొత్తం 50 డివిజన్లకు గానూ 47 డివిజన్లను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.

వైఎస్సార్సీపీ తరఫున 45, 46వ డివిజన్లలో బరిలో ఉన్న బేతపూడి ప్రతాప్‌ చంద్ర ముఖర్జీ, ప్యారీబేగం రెండు నెలలక్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. వీరివురూ తాజా ఫలితాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం మూడు డివిజన్లను మాత్రమే దక్కించుకోగలిగింది. జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. మరోవైపు ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ లో జూలై 30వ తేదీన మేయర్‌, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికను నిర్వహించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 2 =