కర్ణాటకలో కీలక పరిణామం, రాజీనామా చేసిన సీఎం బీఎస్ యడియూరప్ప

BS Yediyurappa, BS Yediyurappa Announces his Resignation, BS Yediyurappa Announces his Resignation as Karnataka Chief Minister, Karnataka Chief Minister, Karnataka chief minister BS Yediyurappa, Karnataka CM BS Yediyurappa, Karnataka CM BS Yediyurappa announces his resignation, Mango News, Yediyurappa Announces his Resignation, Yediyurappa Announces his Resignation as Karnataka Chief Minister, Yediyurappa resigns as Karnataka chief minister, Yediyurappa submits resignation as Karnataka CM

కర్ణాటక రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం ఉదయం తన పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ తావర్ చంద్ గెహ్లాట్ కు సమర్పించగా ఆయన ఆమోదం తెలిపారు. కొత్త సీఎంను ఎన్నుకునేంత వరకు యడియూరప్ప ఆపద్దర్మ సీఎంగా కొనసాగనున్నారు. గత కొన్ని రోజుల్లోగా కర్ణాటకలో నాయకత్వ మార్పుపై పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే సీఎం యడియూరప్ప ఇటీవలే ఢిల్లీ పర్యటన చేపట్టి ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్ర నేతలతో వరుసగా భేటీ అయ్యారు. అనంతరం నాయకత్వ మార్పుకే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు యడియూరప్పకు సమాచారం ఇచ్చినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.

కాగా యడియూరప్ప నేతృత్వంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై నేటితో రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యడియూరప్ప భావోద్వేగ ప్రసంగం చేశారు. రాజకీయ జీవితం తనకూ ఎల్లప్పుడూ అగ్ని పరిక్షగా ఉందన్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ పరిస్థితుల వలన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని, ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపినట్టు తెలిపారు. గతంలో కూడా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తనను కేంద్రంలో మంత్రిగా ఉండమని అడిగారని, కానీ ప్రజల కోసం కర్ణాటకలో ఉంటానని చెప్పానని పేర్కొన్నారు. సీఎంగా నాలుగు సార్లు బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిందని చెప్తూ రాష్ట్ర ప్రజలకు, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − ten =