కర్నూలు జిల్లా అల్లూరులో 1200 కి.మీ పూర్తి చేసుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

Yuvagalam Padayatra TDP Leader Nara Lokesh Reached 1200 km Mile Stone at Alluru Kurnool,Yuvagalam Padayatra,TDP Leader Nara Lokesh Reached 1200 km Mile Stone,1200 km Mile Stone at Alluru Kurnool,Mango News,Mango News Telugu,Yuvagalam Padayatra at Alluru Kurnool,TDP Leader Reached At Kurnool,Yuvagalam Padayatra By TDP Leader,Yuvagalam Padayatra Latst News And Updates,TDP Leader Nara Lokesh Latest News And Updates,Nara Lokesh Reached 1200 km Mile Stone

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 95వ రోజుకి చేరుకుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర.. బుధవారం కోడుమూరు నియోజకవర్గ పరిధి నుంచి నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో కొద్దిదూరం పాదయాత్ర అనంతరం అల్లూరులో 1200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘జనగళమే యువగళమై మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మిడుతూరు, కలమండల పాడు, మాదిగుండం, పారమంచాల చెరువులకు నీరు చేరుతుంది. తద్వారా 22వేల ఎకరాలకు సాగునీరు, మిడుతూరు, జూపాడు బంగ్లా మండలాల పరిధిలో దాదాపు 60 వేలమంది ప్రజలకు తాగునీరు అందుతుంది’’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 1 =