ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరామర్శ

Jana Sena Chief Pawan Kalyan Visits Farmers Who Lost Their Crop Due to Untimely Rains in Joint East Godavari District,Jana Sena Chief Pawan Kalyan Visits Farmers,Farmers Who Lost Their Crop Due to Untimely Rains,Mango News,Mango News Telugu,Jana Sena Chief Pawan Kalyan To Visit Suffered Farmers,To Visit Suffered Farmers Due to Untimely Rains,Pawan Kalyan To Visit Suffered Farmer,Untimely Rains in Joint East Godavari District,Untimely Rains in Joint East Godavari District Tomorrow,Jana Sena Chief Pawan Kalyan,Pawan Kalyan To Visit East Godavari District Tomorrow,Janasena Chief Pawan Kalyan Tour in East Godavari,Pawan Kalyan Latest News And Updates

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇటీవలి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడటం ద్వారా వారి బాధలను స్వయంగా తెలుసుకున్నారు. ఇక ఈ పర్యటనలో పవన్‌‌తో కలిసి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా స్థానిక నేతలు పలువురు పాల్గొననున్నారు.

ఈ క్రమంలో ముందుగా రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి రాజమండ్రి నగరం – బొమ్మూరు – రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలోని కడియం ఆవ భూములలో దెబ్బ తిన్న పంటలను, అక్కడ వ్యవసాయ భూముల్లో మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి చేరుకొని పంట నష్టపోయిన రైతులను కలుసుకుని పరామర్శించారు. ఆ తర్వాత పి. గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం ప్రాంతానికి వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + thirteen =