కాశ్మీర్ సమస్యపై ట్రంప్ వ్యాఖ్యలు ఖండించిన భారత్

Trump Offers To Mediate Kashmir Issue But India Rejects,Mango News,Trump offers to mediate on Kashmir issue India rejects,Trump Offers to Mediate Kashmir Conflict but India Demurs,Trump says Modi asked for US mediation on Kashmir India denies,Row erupts as Trump offers to mediate in Kashmir issue,Trump offers to mediate between India and Pakistan over Kashmir,Trump says PM Modi asked him to mediate in Kashmir dispute India denies claim

ఎన్నో ఏళ్లుగా ఉన్న కాశ్మీర్ వివాదంపై భారత్,పాకిస్తాన్ ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన భేటీలో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చింది, కాశ్మీర్ సమస్యపై జ్యోక్యం చేసుకోవాలని కోరిన ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ , మోడీ కూడ ఈ విషయంపై తనను సంప్రదించారని, అవకాశం వస్తే మధ్యవర్తిగా ఉంటానంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. కాశ్మీర్ వ్యవహారంలో ఎవరిని మధ్యవర్తిత్వానికి ఆహ్వానించలేదని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిథి రవీశ్ కుమార్ స్పష్టం చేసారు, ట్రంప్ కు మోడీ ఎలాంటి అభ్యర్ధన చేయలేదు, పాకిస్తాన్ తో ఉన్న సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించాలని భారత్ కోరుకుంటుందని తెలిపారు.

ఈ రోజు పార్లమెంట్లో కూడ ట్రంప్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది,లోక్ సభలో కాంగ్రెస్,రాజ్యసభలో సిపిఐ నేతలు నోటీసులు ఇచ్చారు. ట్రంప్,మోడీకి మధ్య జరిగిన భేటీకి సంబంధించి విషయాలను బహిర్గతం చేయాలనీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ మాట్లాడుతూ కాశ్మీర్ విషయంలో మోడీ ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కోరలేదని వివరణ ఇచ్చారు. మరో వైపు అమెరికా సైతం దిద్దుబాటు చర్యలను చేపట్టింది, ట్రంప్ వ్యాఖ్యలను అమెరికా కాంగ్రెస్ లోని అనేక మంది సభ్యులు వ్యతిరేకించారు. డెమోక్రాటిక్ సెనెటర్ బ్రాడ్ షెర్మన్, ట్రంప్ వ్యాఖ్యలు తమను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని, భారత్ ఎప్పుడు మూడో వ్యక్తి జోక్యాన్ని కాశ్మీర్ అంశంలో కోరుకోలేదని, అమెరికాలోని భారత రాయబారి హర్ష్ వర్ధన్ ష్రింగ్లాకు క్షమాపణ చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనే , అమెరికా ప్రతినిధులు దిద్దుబాటు చర్యలకు దిగారని పరిశీలకులు భావిస్తున్నారు.


Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here