ఎపిసోడ్ 23( ఆగస్టు 12) హైలైట్స్: నామినేషన్ పక్రియ, రోహిణి-శివజ్యోతిలకు బిగ్ బాస్ షాక్

Akkineni Nagarjuna, Baba Master, Bigg Boss, Bigg Boss Episode 23, Bigg Boss Episode 23 Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode 23 Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Hema, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 16, himaja, Jaffar, Mango News Telugu, punarnavi, Rahul, Ravi, Rohini, Sreemukhi, Tammanah Simhadri eleminated, Varun Sandesh, Vithika

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 13 మంది సభ్యులున్నారు. ఆగస్టు 12న ప్రసారమైన బిగ్ బాస్-3 ఇరవైమూడవ ఎపిసోడ్ లో నామినేషన్ పక్రియ కొనసాగింది. ఇద్దరిద్దరు సభ్యులని కన్ఫెషన్ రూములోకి పిలిచి, ఇద్దరులో ఎవరు నామినేట్ అవుతారో చెప్పాలని బిగ్ బాస్ వారిని కోరాడు. నామినేషన్ ప్రాసెస్ లో మహేష్ విట్టా-వరుణ్ సందేశ్, వితికా-రవికృష్ణ, హిమజ-రాహుల్ మధ్య జరిగిన సంభాషణతో ఎపిసోడ్ ఆసక్తికరంగా నడిచింది.

ఎపిసోడ్ 23( ఆగస్టు 12) హైలైట్స్: నామినేషన్ పక్రియ, రోహిణి-శివజ్యోతిలకు బిగ్ బాస్ షాక్

 • ఎపిసోడ్ ప్రారంభంలో అలీరేజా గురించి హిమజ శ్రీముఖి, బాబాబాస్కర్ తో చర్చించింది
 • అందమైన ప్రేమరాణి సాంగ్ కి ఇంటి సభ్యులు డాన్స్ చేసారు
 • ఇంటి క్లీనింగ్ విషయంలో బాబాబాస్కర్ శివజ్యోతి కి సలహాలు ఇస్తారు
 • ఇంటి సభ్యులు ఏ పనులు చేయాలనే విషయంపై వాదించుకున్నారు
 • వరుణ్ సందేశ్ – వితికా ఇంటిలో జరుగుతున్న విషయాలు మాట్లాడుకుంటూ, రొమాన్స్ కొనసాగించారు

నామినేషన్స్ ఈ విధముగా కొనసాగాయి:

 • ఈసారి కొత్తగా ఇద్దరిద్దరు సభ్యులని కన్ఫెషన్ రూములోకి పిలిచి, ఇద్దరులో ఎవరు నామినేట్ అవుతారో చెప్పాలని బిగ్ బాస్ వారిని కోరాడు. అలీరేజా,పునర్నవి సీక్రెట్ టాస్క్ విజయవంతంగా చేయడంతో వారిని నామినేషన్స్ నుండి మినహాయించారు, టాస్క్ లో చేసిన దానికి శిక్షగా శ్రీముఖి నేరుగా ముందే నామినేట్ అయింది.
 • మొదటగా వితికా-రవికృష్ణ కన్ఫెషన్ రూమ్ కి వెళ్లారు, వితికా రవిని నామినేట్ చేసింది, టాస్క్ లో చేసిన తప్పుకు తాను నామినేట్ అయినట్టు రవి తెలిపాడు
 • రోహిణి-శివజ్యోతి లలో ఒక అవగాహనతో శివజ్యోతి నామినేట్ అయింది
 • మహేష్ విట్టా-వరుణ్ సందేశ్ లలో ఎవరు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు సేఫ్ అవ్వాలని కోరుకున్నారు, అయితే చివరికి వరుణ్ సందేశ్ నామినేట్ అయ్యాడు
 • నామినేషన్ గురించి ఇంటిసభ్యులకు చెప్పినందుకు రోహిణి-శివజ్యోతి లను బిగ్ బాస్ ఈవారంతో పాటు వచ్చే వారంకూడ నామినేట్ చేసారు
 • బాబాబాస్కర్- అషురెడ్డి లలో బాబాబాస్కర్ నామినేట్ అయ్యాడు
 • హిమజ-రాహుల్ లలో కొంతవాదన తరువాత హిమజ సేఫ్ అయ్యింది
 • ఈ వారం ఎలిమినేషన్ ప్రోసెస్ కి బాబాబాస్కర్, రాహుల్, వరుణ్ సందేశ్, రోహిణి, శివజ్యోతి, రవికృష్ణ, శ్రీముఖి నామినేట్ అయ్యారు        
 • బక్రీద్ సందర్భంగా ఇంటిలో సంబరాలు చేసారు, ఇంటి సభ్యులకు వారి చిన్ననాటి ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలు చూపించారు
 • వారి కుటుంబసభ్యులను గుర్తుచేసుకుంటూ ఇంటి సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు
 • చివర్లో సభ్యులంతా సాంగ్స్ కి డాన్స్ చేసారు
 • ఈ ఎపిసోడ్ అంతా నామినేషన్స్, ఎమోషన్స్ తో ఆసక్తిగా సాగింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + three =