వీకెండ్(జూలై27,28) ఎపిసోడ్స్ హైలైట్స్ : హేమ అవుట్, వైల్డ్ కార్డు ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి

Bigg Boss 3 Telugu Contestants Episode 7 Highlights, Bigg Boss 3 Telugu Episode 8 Nomination Highlights, Bigg Boss 3 Telugu Latest News, Bigg Boss Season 3 Telugu weekend Episodes Highlights, Bigg Boss Season 3 weekend Elimination, Hema Elimination in Bigg Boss 3 Telugu, Mango News, Nominations War in Bigg Boss House

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. జులై 27, 28న ప్రసారమైన బిగ్ బాస్ 3 ఏడు,ఎనిమిదవ ఎపిసోడ్ లో ఇంటి సభ్యులతో నాగార్జున సరదాగా ముచ్చటించారు, జరుగుతున్న గొడవలపై స్పందించారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో హేమ ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించారు. తరువాత తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నట్టు ప్రకటించారు.

ఎపిసోడ్ 7 (జూలై27), ఎపిసోడ్ 8 (జూలై28) హైలైట్స్: హేమ అవుట్, వైల్డ్ కార్డు ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి

శనివారం(జూలై27) ఎపిసోడ్:

 • శనివారం నాడు నాగార్జున వచ్చిన వెంటనే, మన టివి ద్వారా సభ్యుల మధ్య జరిగిన సంభాషణలు చూపించారు
 • బాత్ టబ్ లో వరుణ్ సందేశ్, వితికా ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నారు
 • తన భార్య గుర్తొచ్చి ఎమోషనల్ అయిన జాఫర్ ను శ్రీముఖి, బాబాబాస్కర్ ఓదార్చారు
 • సావిత్రి తన ప్రేమ కథ చెప్పి, తన భర్త గొప్పతనాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది
 • తరువాత పాసింగ్ పిల్లో ద్వారా సభ్యులు గడిచిన వారం రోజులు సభలో ఎలా ప్రవర్తించారో గుర్తు చేసారు, చేసిన తప్పులను గుర్తు చేస్తూ నాగార్జున అందరితో కలివిడిగా మాట్లాడారు
 • నామినేట్ అయి ఎలిమినేషన్ లో భాగమైన ఆరుగురు ఇంటి సభ్యులలో మొదటిగా హిమజ సేవ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు, తరువాత పునర్నవి భూపాలంను సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు. మిగిలిన నలుగురు సభ్యులు ఆదివారం ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు

ఆదివారం(జూలై 28) ఎపిసోడ్:

 • మన్మధుడు-2 సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు
 • సభ్యులతో సరదాగా ముచ్చటిస్తూ, ఆటలు ఆడించారు
 • సభ్యులందరినీ గుడ్, యావరేజ్, బాడ్ అనిపించే ఇతర సభ్యుల పేర్లను మూడు కలర్ పేపర్లపై రాసి బౌల్ లో వేయాలని సూచించారు
 • తరువాత 15 మంది ఇంటి సభ్యులను ఐదుగురు చొప్పున, మూడు గ్రూపులుగా విడిపొమ్మని చెప్పారు.ఒక్కో గ్రూప్ నుంచి ఒక యాక్టర్ ను ఎన్నుకోమనగా రోహిణి, శ్రీముఖి, వితికాను యాక్టర్లుగా ఎన్నుకున్నారు. ఈ డంబ్ షెరాజ్ గేమ్ లో మొదటిగా రోహిణి నాలుగు పాటలు గుర్తుపట్టేలా అభినయం చేసింది, రోహిణి ప్రదర్శన తరువాత రాహుల్, వితికా సేఫ్ జోన్ లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు. వితికా షెరు,శ్రీముఖి కూడ నాలుగు పాటలు గుర్తుపట్టేలా చేయడంతో మార్కుల ఆధారంగా రోహిణి టీంని నాగార్జున విజేతగా ప్రకటించారు.
 • మొదటగా సభ్యులు బౌల్ లో వేసిన చిట్టీల ప్రకారం, బాబాబాస్కర్ గుడ్ అని, యావరేజ్ గా జాఫర్, బాడ్ గా హేమ పేరు రాసారు. హౌజ్ లో వాళ్లే కాకుండా, ప్రేక్షకులు కూడ హేమకు తక్కువ ఓట్లు వేశారని, హేమ ఎలిమినేట్ అయ్యినట్టు నాగార్జున ప్రకటించారు
 • బయటకు వచ్చిన హేమను ఎవరు గెలుస్తారని అడగగా, శ్రీముఖి, బాబాబాస్కర్ పేర్లు చెప్పారు, తరువాత హేమ ఇంటి సభ్యులందరికి కొన్ని సూచనలు చేసారు
 • హేమ ఎలిమినేషన్ తరువాత, తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నట్టు నాగార్జున ప్రకటించారు, హౌజ్ లో నిరూపించుకుంటానని, అవకాశం ఇచ్చినందుకు తమన్నా సింహాద్రి బిగ్ బాస్ నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పారు. బిగ్ బాస్ చెప్పినపుడు హౌజ్ లోకి వెళ్లాలని నాగార్జున, తమన్నా సింహాద్రి కి సూచించారు.
 • శని,ఆదివారాల్లో ప్రసారమైన ఎపిసోడ్స్ లో నాగార్జున తనదైన శైలిలో వ్యాఖ్యాతగా ఆకట్టుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here