బిగ్ బాస్-3: ఎలిమినేట్ అయినా హిమజ

Bigg Boss 3 Telugu Contestants Latest News, Bigg Boss Telugu 3 Latest Updates, Bigg Boss Telugu 3 Updates, Bigg Boss Telugu 3 Updates Himaja Eliminated, Bigg Boss Telugu 3 Updates Himaja Gets Eliminated, Bigg Boss Telugu 3 Weekend Episode, Bigg Boss Telugu 3 Weekend Episode Highlights, Bigg Boss Telugu 3 Weekend Episode Updates, Bigg Boss Telugu Season 3, Himaja Gets Eliminated, Mango News Telugu

జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఆదివారం నాడు జరిగిన 64వ ఎపిసోడ్ లో నటి హిమజ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ లో మహేష్ విట్టా, రాహుల్, హిమజ ఉండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. శనివారం నాడు ఇంటిలోంచి రాహుల్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించి చివర్లో ఇది ఫేక్ ఎలిమినేషన్ అని నాగార్జున అందరికి షాక్ ఇచ్చారు. మళ్ళీ బిగ్ బాస్ చెప్పినపుడు హౌజ్ లోకి వెళ్ళమని రాహుల్ కి సూచించారు. ఇక మిగిలిన మహేష్, హిమజలలో ఆదివారం నాడు హిమజను హౌజ్ నుంచి బయటకు పంపించారు. అవకాశం వస్తే మళ్ళీ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తారా అని హిమజను అడగగా ఒకసారి బయటకు వెళ్ళాక మళ్ళీ హౌజ్ లోకి వెళ్లడం అనేది ఫెయిర్ కాదని, ఇది వన్ టైం డ్రీమ్ మాత్రమేనని చెప్పింది.

ఆదివారం నాడు కింగ్ అక్కినేని నాగార్జున తో పాటు, హీరో వరుణ్ తేజ్ కూడ బిగ్ బాస్ షోలో సందడి చేసారు. ఇటీవలే విడుదలైన తన గద్దలకొండ గణేష్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ ఇంటి సభ్యులతో ముచ్చటిస్తూ, డాన్సులు చేయిస్తూ ఎపిసోడ్ ని పూర్తి సరదాగా నడిపించారు. చివర్లో హిమజ ఎలిమినేట్ అవుతున్నట్టు వరుణ్ తేజ్ ప్రకటించాడు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో ఇప్పటికి 64 రోజులు పూర్తయ్యాయి. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, అలీరేజా, శిల్ఫా చక్రవర్తి, హిమజ ఎలిమినేట్ అవ్వడంతో ఇంటిలో ఇంకా 9 మంది సభ్యులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here