అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్లో పెచ్చులూడి తలపై పడడంతో యువతి మృతి

A woman died In Ameerpet Metro Station, A woman died In Ameerpet Metro Station After Falling Concrete Chunks, A woman died In Ameerpet Metro Station After Falling Concrete Chunks On Her, Ameerpet Metro Station, Mango News Telugu, Political Updates 2019, Telangana Breaking News, woman died In Ameerpet Metro Station, Woman Dies After Piece Of Ameerpet Metro Station Wall Falls On Her

సెప్టెంబర్ 22, ఆదివారం నాడు అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్ ఆవరణలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మెట్రో స్టేషన్లో సీలింగ్ పెచ్చులూడి తలపై పడడంతో కంతాల మౌనిక అనే యువతి ప్రాణాలు కోల్పోయారు. బయట వర్షం కురుస్తుండడంతో ఆమె మెట్రో స్టేషన్ కింద నిరీక్షిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె వయసు 24 సంవత్సరాలు, ఇటీవలే వివాహం అయినట్టు కూకట్ పల్లి హౌజింగ్ బోర్డులో నివాసముంటున్నట్టుగా గుర్తించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జరిగిన ప్రమాద ఘటనపై హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. మెట్రో స్టేషన్ సీలింగ్ భాగం నుంచి సిమెంట్ పెచ్చులూడి, 9 మీటర్ల ఎత్తునుంచి మహిళ తలపైనా పడడంతో ప్రమాదవశాస్తూ మృతి చెందారని చెప్పారు. మౌనిక కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఎల్ అండ్ టీ సంస్థకు సూచిస్తామన్నారు. నగరంలో ఈ ఘటన సంచలనం సృష్టించడంతో మూడు మార్గాల్లో ఉన్న 64 స్టేషన్లలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా నిపుణల బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తెలిపారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =