పీఏసీ చైర్మన్ గా అక్బరుద్దీన్ ఒవైసీ నియామకం

Akbaruddin Owaisi Elected As Public Accounts Committee Chairman, AIMIM Akbaruddin Owaisi Elected As Public Accounts Committee Chairman, AIMIM Floor Leader Akbaruddin Owaisi, AIMIM Floor Leader Akbaruddin Owaisi Elected As Public Accounts Committee Chairman, Mango News Telugu, Political Updates 2019, Public Accounts Committee Chairman, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 22, ఆదివారంతో ముగిసాయి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి సభా కమిటీలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ గా ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీను నియమించారు. పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ(పీఈసీ)చైర్మన్ గా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రెండోసారి ఈ పదవికి నియమితులయ్యారు. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ(పీయూసీ)చైర్మన్ గా ఆర్ముర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక ఒక్కో కమిటీలో 13 మంది సభ్యులను నియమించారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే జోన్ యూజర్స్ కమిటీ సభ్యుడిగా వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ను నామినేట్ చేసారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) సభ్యుల వివరాలు:
అక్బరుద్దీన్‌ ఒవైసీ (చైర్మన్)
ఎమ్మెల్యేలు: గ్యాదరి కిషోర్‌, విఠల్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, జైపాల్‌యాదవ్‌, రవీంద్రకుమార్‌ నాయక్‌, బిగాల గణేశ్‌గుప్తా, శ్రీధర్‌బాబు, సండ్ర వెంకట వీరయ్య
ఎమ్మెల్సీలు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సయ్యద్‌ జాఫ్రీ, డి.రాజేశ్వర్‌రావు, సుంకరి రాజు

పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ(పీఈసీ) సభ్యుల వివరాలు:
సోలిపేట రామలింగారెడ్డి (చైర్మన్)
ఎమ్మెల్యేలు: మాగంటి గోపీనాథ్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జాజుల సురేందర్‌, కోనేరు కోనప్ప, చిరుమర్తి లింగయ్య, మాధవరం కృష్ణారావు, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, రాజాసింగ్‌                                                                                                                ఎమ్మెల్సీలు: బాలసాని లక్ష్మీనారాయణ, ఆకుల లలిత, మీర్జా ఉల్‌ హసన్‌ ఎఫెండీ, భూపాల్‌రెడ్డి

పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ(పీయూసీ) సభ్యుల వివరాలు:
ఆశన్నగారి జీవన్‌రెడ్డి (చైర్మన్)
ఎమ్మెల్యేలు: కోరుకంటి చందర్‌, శంకర్‌నాయక్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్‌, అబ్రహాం, దాసరి మనోహర్‌ రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్‌ పాషా ఖాద్రి
ఎమ్మెల్సీలు: జీవన్‌రెడ్డి, ఫారూక్‌ హుస్సేన్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here