ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Good News For Prabhas Fans Salar In OTT, Good News For Prabhas Fans, Salar In OTT, Salaar Movie OTT, Netflix, Prabhas Fans, Latest Salar News, Salar OTT News, Salar 2024, Salar, Tollywood News, Tollywood Movies, Telugu Movies, Mango News, Mango News Telugu
Salaar Movie OTT, Salar in OTT, Good news for Prabhas fans, Netflix, Prabhas fans

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరక్షన్‌లో  తెరకెక్కిన సలార్ మూవీ..కాస్త స్లోగానే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ రికార్డులనే క్రియేట్‌ చేసింది. టాలీవుడ్, బాలీవుడ్‌లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించి ప్రభాస్ రేంజ్‌ను మరోసారి చాటింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ  ప్రముఖ ఓటీటీ  సంస్థ.. నెట్‌ఫ్లిక్స్‌  ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని ప‍్రకటించింది.

గతేడాది ఇయర్ ఎండింగ్‌కు.. క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 22వ తేదీన ఆడియన్స్  ముందుకు వచ్చిన సలార్ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీగా కలెక్షన్స్‌ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ.700 కోట్ల మార్క్‌ను దాటి ప్రభాస్‌ ఖాతాలో మరో భారీ హిట్‌ మూవీ రికార్డ్‌ని క్రియేట్‌ చేసింది.

ఇప్పటికే చాలాసార్లు థియేటర్‌లో సలార్‌ను చూసిన అభిమానులు.. ఓటీటీలో వస్తే మళ్లీ మళ్లీ చూడాలని ఎదురు చూస్తున్నారు. సలార్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని  ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు.  దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ శుభవార్త వినిపించింది. ప్రభాస్ నటించిన ‘సలార్‌’ మూవీని  జనవరి 20 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ న్యూస్‌తో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

నిజానికి జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజు సలార్ మూవీ ఓటీటీలోకి వస్తుందని అందరూ అనుకున్నారు.  కానీ కాస్త ముందుగానే ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన  నెట్‌ఫ్లిక్స్‌.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. ఖాన్సారా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సలార్ మూవీలో ప్రభాస్‌ యాక్షన్‌కు.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ట్యాలెంట్‌ తోడవడంతో ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్‌ హిట్‌‌గా నిలిచింది.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతీ హాసన్‌, ఈశ్వరిరావు, జగపతిబాబు తమ రోల్స్‌తో మూవీ హిట్స్‌లో పాలు పంచుకున్నారు.అయితే సలార్‌కు పార్ట్‌-2 కూడా ఉంటుందని మూవీ టీమ్ ప్రకటించడంతో ఇప్పుడు అదెలా ఉంటుందోనని అంచనాలు పెరిగిపోయాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =