నాలుగో జాబితాను ప్రకటించిన వైసీపీ

YCP Announced the Fourth List, YCP Fourth List Announced, YCP Fourth List, YCP, AP Elections, CM Jagan, Latest YCP Fourth List, YCP Fourth List News, YCP Fourth List Updates, Latest YCP News, YCP Candidates News, AP, CM Jagan, Assembly Elections, Mango News, Mango News Telugu
YCP, YCP Fourth list, AP Elections, CM Jagan

వైసీపీ దూకుడు పెంచేసింది. రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో.. అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటికే 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్ సభ స్థానాలకు వైసీపీ ఇంఛార్జ్‌లను ప్రకటించేసింది. ఇప్పటి వరకు మొత్తం మూడు జాబితాలు ప్రకటించగా.. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు అభ్యర్థలను ఖరారు చేసింది. తాజాగా అభ్యర్థుల నాలుగో జాబితాను కూడా వైసీపీ విడుదల చేసింది.

సుధీర్ఘ కసరత్తు తర్వాత నాలుగో జాబితాను ప్రకటించింది. మొత్తం 9 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం రాత్రి ప్రకటించారు. ఇందులో ఒక ఎంపీ స్థానంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రస్తుతం చిత్తూరు ఎంపీగావున్న రెడ్డప్ప స్థానంలో.. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఇంఛార్జ్‌గా హైకమాండ్ నియమించింది. ఇక గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా హోం మంత్రి తానేటి వనితను వైసీసీ హైకమాండ్ ఖరారు చేసింది.

తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా నల్లగట్ల స్వామిదాసును.. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా దద్దాల నారాయణ యాదవ్‌ను.. జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా రెడ్డప్పను.. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా నల్లగట్ల స్వామిదాసును.. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఎం.వీరాంజనేయులను.. తలారి వెంకట్రావును కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా.. ఈర లక్కప్పను మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా.. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా డాక్టర్ సుధీర్ ధారలను వైసీపీ హైకమాండ్ నియమించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eleven =