ఆదిత్య ఎల్-1 ప్రయాణంలో మరో మైలురాయి

Aditya L-1, ISRO, India, S somanath, Indian space research organization
Aditya L-1, ISRO, India, S somanath, Indian space research organization

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఒక్కో దశను దాటి సూర్యుడికి చేరువవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన చేపట్టిన ఈ ప్రయోగం ప్రస్తుతం తుది దుశకు చేరుకుంది. అతి త్వరలో ఆదిత్య ఎల్-1 మిషన్ తన గమ్యస్థానాన్ని చేరుకోనుంది. ఈ మేరకు ఇస్రో దీనిపై కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జనవరి 6న ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానాన్ని చేరుకోనుందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథన్ వెల్లడించారు.

సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్1 మిషన్‌ను ప్రారంభించింది. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. ఈ మిషన్ దాదాపు 15 లక్షల కి.మీ దూరం ప్రయాణించి లగ్రాంజ్ పాయింట్ చేరుకున్న తర్వాత పరిశోధనలను మొదలు పెడుతుంది.  మొత్తం ఏడు పేలోడ్లను ఆదిత్య ఎల్1 మోసుకెళ్లగా.. అవి సౌర వాతావరణం, కరోనల్ మాస్ ఎజెక్షన్, సౌర జ్వాలలు వంటి విషయాలను అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతాయి.

జనవరి 6న ఆదిత్య ఎల్1 మిషన్‌ లగ్రాంజ్ పాయింట్-1లోకి ప్రవేశిస్తుందని తాము ఆశిస్తున్నామని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఆదిత్య ఎల్1 స్పేష్ మిషన్ మరో ఇంజిన్‌ను స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత తన కక్ష్యలో ఆదిత్య ఎల్1 పరిభ్రమిస్తూ పరిశోధనలు చేస్తుందని వివరించారు. ఐదేళ్లపాటు కక్షలో ఆదిత్య ఎల్1 పరిభ్రమిస్తుందని.. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు ఉపయోగపడే సమాచారాన్ని ఈ మిషన్ సేకరిస్తుందని వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =