హైదరాబాద్ నీటి అవసరాలకు కాళేశ్వరం ఉందన్న కేటీఆర్

Is a water crisis looming over Hyderabad, KTR Comments About Water Crisis Report, KTR latest Political News, KTR Response On Hyderabad Water Crisis Report, Mango News, Telangana Political News, Water Crisis Report Response By KTR

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ట్విట్టర్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పోస్ట్ చేసారు.’ ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో, గోదావరిలో అసలు ఏమాత్రం వరద రాని సీజన్ లో ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని అయిదు మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి పది రోజుల్లో 11 టీఎంసీ నీటిని ఒడిసిపట్టి నిల్వ చేశామని, దీనితో కనీసం లక్షన్నర ఎకరాలకు నీరు అందించవచ్చని, ఇది ప్రారంభం మాత్రమే అని, వర్షాలు కురిసి, వరద పెరిగి అన్ని మోటార్లు మొదలైతే తెలంగాణలో బీళ్లన్ని గోదావరి నీటితో సస్యశ్యామలం అవుతాయని, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అవడం వల్ల తెలంగాణకు ఇటువంటి లబ్ది చేకూరింది ‘ అని పేర్కొన్నారు.

అంతే కాకుండా హైదరాబాద్ నగరంలోని, తాగునీటి అవసరాలను కూడ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీరుస్తుందని, సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించి, పట్టుదలతో 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం వలనే, చెన్నై మరియు ఇతర మెట్రోపాలిటన్ నగరాలు ఎదురుకుంటున్న తాగునీటి సంక్షోభం రాకుండ, హైదరాబాద్ నగరం బయటపడిందని చెప్పారు.

హైదరాబాద్ లో 48 రోజుల తర్వాత తాగునీరు అందుబాటులో ఉండదని వస్తున్న వార్తలపై సినిమా దర్శకుడు మారుతి అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ, అటువంటిది ఏమి లేదని, ఆ రిపోర్ట్ లో నిజంలేదని కేటీఆర్ స్పష్టం చేసారు. వచ్చే కొద్ది వారాల్లో, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీరు ఏల్లంపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్న తర్వాత, అక్కడి నుండి హైదరాబాద్‌కు 172 ఎంజిడి నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. అదే సమయంలో, పౌరులందరూ నీటి సంరక్షణ మరియు హార్వెస్టింగ్ యొక్క ప్రాముఖ్యతను గ్రహించి నడుచుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేసారు.

 

 

[subscribe]
[youtube_video videoid=AqMqdhsTlBc]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =