నాచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల

Gang Leader Movie Teaser Release Date, Gang Leader Movie Updates, Gang Leader Pre Look Out Now, Gang Leader Telugu Movie Latest News, Gang Leader Telugu Movie Pre Look Poster, Mango News, Nani Gang Leader Pre Look Out, Nani Starrer Gang Leader Pre Look Poster Out, Nani Upcoming Movie Latest News

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, వినూత్న చిత్రాల దర్శకుడు కే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం నాని గ్యాంగ్ లీడర్. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ రోజు ‘నాని గ్యాంగ్ లీడర్’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు, సినిమా సబ్జెక్టు కి అనుగుణంగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తి రేపేలా ఉండి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఇక నుంచి వరుసగా చిత్ర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని యూనిట్ నిర్ణయించింది. అందులో భాగంగా నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 15 న విడుదల చేయనున్నారు. అలాగే ఫస్ట్ సాంగ్ ని జులై 18 న, టీజర్ ని జులై 24 న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఆగష్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. నాని గత చిత్రం జెర్సీ కి మంచి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వరుస విజయాలు సాధిస్తున్న నాని, సరికొత్త కధాంశాలతో చిత్రాలు రూపొందించే దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here