నేడు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి జన్మదినం.. జూ. ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు

Pan India Director SS Rajamouli Celebrating 49th Birthday Today Several Celebrities Extends Wishes, SS Rajamouli Celebrating 49th Birthday, Celebrities Extends Wishes To SS Rajamouli, SS Rajamouli Birthday, Mango News, Mango News Telugu, Student No.1, Simhadri, Sye, Chatrapathi, Vikramarkudu, Yamadonga, Magadheera, Maryada Ramanna, Eega, Baahubali: The Beginning, Baahubali 2: The Conclusion, RRR ( Rise Roar Revolt ), SS Rajamouli 49th Birthday

ఎస్ఎస్ రాజమౌళి.. పరిచయం అక్కరలేని పేరు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడుగా తిరుగులేని గుర్తింపు దక్కించుకున్న ఆయన ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ దర్శక ధీరుడు 50వ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తన మొదటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జూ. ఎన్టీఆర్ ట్విట్టర్‌లో.. ‘హ్యాపీ బర్త్‌డే జక్కన్న.. ఎప్పటిలాగే మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా రాజమౌళికి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అభినందనలు తెలియజేస్తున్నారు.

ప్రముఖ హిందీ నటుడు, అజయ్ దేవగణ్ కూడా రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ట్విట్టర్‌లో.. ‘డియర్ రాజమౌళి సర్. ఒక అద్భుతమైన విజన్‌ని కలిగిన మిమ్మల్ని నేను చాలా అభిమానిస్తాను. మా అందరికీ మీ సినిమా అంటే చాలా ఇష్టం. ఇండియాను ఎల్లప్పుడూ గర్వపడేలా చేస్తూ ఉండండి సార్’ అని సందేశం ఇచ్చారు.

ఇక టాలీవుడ్ యువ నటుడు సాయి ధరమ్ తేజ్ కూడా రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారతీయ సినిమాకు టార్చ్ బేరర్ అయిన గొప్ప వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఇలాగే అందరి నుంచి గొప్ప ఖ్యాతిని, ప్రేమను పొందుతూ ఉండాలి’ అని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత విజయవంతమైన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్ అగ్రనటులు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ సినిమా ‘ఆస్కార్’ బరిలో దిగడం విశేషం. ఇక ఇప్పటివరకు రాజమౌళి నేషనల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 3, సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 4, మరియు 5 నంది అవార్డులు గెలుచుకున్నారు. అలాగే కళా రంగానికి చేసిన కృషికి గానూ 2016లో భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించడం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + ten =