సైమా 2019 అవార్డ్స్ -టాలీవుడ్ విజేతలు

Mango News, SIIMA 2019 Telugu Winners List, Full List Of SIIMA Winners 2019, SIIMA Awards 2019, Rangasthalam Wins It Big At Siima Awards, Siima Award Won by Rangasthalam, Rangasthalam Movie Latest News, SIIMA 2019 winners full list, SIIMA Awards 2019 Telugu Winners List, SIIMA Awards 2019 Telugu Complete List Of Winners

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు గురువారం నాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఈసారి ఖతార్ లో నిర్వహిస్తున్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల నటీనటులకు అవార్డులను అందజేసారు. రెండవ రోజు తమిళ్, మలయాళం చిత్ర పరిశ్రమలకు చెందిన అవార్డులు అందజేస్తారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఉత్తమనటుడిగా అవార్డు సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తరుపున అవార్డు అందుకున్నారు. తెలుగులో రంగస్థలం సినిమా అత్యధికంగా 9 అవార్డ్స్ కైవసం చేసుకుంది. యాంకర్లుగా సుమ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు వ్యవరించారు.

సైమా అవార్డ్స్-2019 టాలీవుడ్ విజేతలు:

ఉత్తమ నటుడు: రామ్‌చరణ్‌ (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్ర ప్రసాద్‌ ( మహానటి)
ఉత్తమ నటి: కీర్తి సురేష్‌ (మహానటి)
ఉత్తమ సహాయ నటి: అనసూయ (రంగస్థలం)
ఉత్తమ నటుడు( క్రిటిక్): విజయ్‌ దేవరకొండ( గీత గోవిందం)
ఉత్తమ నటి( క్రిటిక్): సమంత (రంగస్థలం)
ఉత్తమ చిత్రం: మహానటి
ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగస్థలం)
ఉత్తమ పరిచయ దర్శకుడు: అజయ్‌ భూపతి (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ హాస్య నటుడు: సత్య (ఛలో)
ఉత్తమ విలన్‌: శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవవే – రంగస్థలం)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి( పిల్ల రా సాంగ్ – ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ గాయని: ఎంఎం మానసి (రంగమ్మా మంగమ్మ సాంగ్ – రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు: కల్యాణ్ దేవ్‌ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి: పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ కళా దర్శకడు: మౌనిక రామకృష్ణ (రం‍గస్థలం)
పాపులర్‌ స్టార్ ఇన్ సోషల్ మీడియా: విజయ్‌ దేవరకొండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twenty =