క్యాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని

Actress Hamsa Nandini, Actress Hamsa Nandini diagnosed with Cancer, Hamsa Nandini, Hamsa Nandini Cancer, Hamsa Nandini Diagnosed With Breast Cancer, Mango News, Mango News Telugu, Prabhas Mirchi Actress Hamsa Nandini Diagnosed With Breast Cancer, Telugu Heroine Diagnosed With Cancer, Tollywood actress diagnosed with Cancer, Tollywood Actress Hamsa Nandini Diagnosed, Tollywood Actress Hamsa Nandini Diagnosed with a Grade III Breast Cancer

టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని హంసానందిని స్వయంగా తెలిపింది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమెకు క్యాన్సర్ 3వ దశలో ఉన్నట్లు చెప్పారు. అయితే, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి తాను కోలుకుంటానన్న ఆశాభావాన్ని హంసానందిని వ్యక్తం చేసింది. కాగా, 18 సంవత్సరాల క్రితం హంసానందిని తల్లి కూడా క్యాన్సర్ వ్యాధితోనే మరణించారు.

కానీ, తాను మాత్రం క్యాన్సర్ మహమ్మారిపై విజయం సాధిస్తానని నమ్మకంతో ఉన్నానని హంసా చెప్పారు. ప్రస్తుతం హంసానందిని కీమోథెరపీ చేయించుకుంటున్నారు. తనకు ఇప్పటివరకు 9 సైకిల్స్ పూర్తవగా, ఇంకో 7 సైకిల్స్ ఉన్నాయి. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమా టైటిల్ సాంగ్ లో హంసానందిని అభినయం తెలుగు ప్రేక్షకులకి గుర్తుండే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు చిరపరచితమైన హంసానందిని ఇలా క్యాన్సర్ మహమ్మారి బారిన పడటం తెలుగు సినీ అభిమానులని బాధకి గురిచేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − one =