బెంగళూరులోని అతిపెద్ద కోవిడ్ సెంటర్ మూసివేయాలని నిర్ణయం

bengaluru, Biggest Covid Care Centre, Biggest Covid Care Centre in Bengaluru, Biggest Covid Care Centre in Bengaluru Closed, Biggest Covid Care Centre in Bengaluru will be Closed, COVID-19 care centre in Bengaluru, India biggest covid care centre in Bengaluru, India largest Covid Care Centre

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు చికిత్స అందించేందుకు బెంగళూరు నగరంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద 10 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ అతి పెద్ద కోవిడ్ కేర్ సెంటర్‌ ను సెప్టెంబరు 15న మూసివేయనున్నట్టు బీబీఎంపీ వెల్లడించింది.

లక్షణాలు కనిపించకుండా కోవిడ్ పాజిటివ్ గా వచ్చిన వారిని, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని సైతం హోం ఐసోలేషన్‌లో ఉండటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, కోవిడ్ కేంద్రాల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయిందని ఈ నేపథ్యంలోనే ఈ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ పై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుని, కోవిడ్ కేంద్రాన్ని మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. అందులోని బెడ్స్, ఫ్యాన్స్, ఇతర సామాగ్రిని ప్రభుత్వ ఆసుపత్రులకు, వసతి గృహాలకు ఉచితంగా అందజేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 14 =