తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 684 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

Telangana Corona Updates: 684 New Positive Cases, 394 Recovered Cases Reported on Mar 30

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 684 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 30, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,889 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 394 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 3,01,227 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 97.83 శాతంగా ఉంది.

ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1697 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,965 యాక్టీవ్ కేసులు ఉండగా, ఇందులో 1,873 మంది హోం‌/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 184, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 61, నిజామాబాదులో 48, రంగారెడ్డి జిల్లాలో 45, నిర్మల్ లో 30, నల్గొండలో 24, కరీంనగర్ లో 23, మహబూబ్ నగర్ లో 23, సంగారెడ్డిలో 21, జగిత్యాలలో 19, యాదాద్రి భువనగిరిలో 17, వరంగల్ అర్బన్ లో 17 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eighteen =