సిక్కింలో ఘోర ప్రమాదం.. ఆర్మీ ట్రక్ లోయలో పడి 16 మంది జవాన్లు దుర్మరణం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం

16 Indian Jawans Lost Lives as Army Truck Falls into Gorge in North Sikkim Today Defence Minister Rajnath Singh Condoles,Fatal Accident In Sikkim,Army Truck Falls Into Valley,16 Jawans Die,Defense Minister Rajnath Singh Mourns,Mango News,Mango News Telugu,Sikkim Army Area,Sikkim Army Cantt,Sikkim Army Camp,Sikkim Army Vehicle Accident,Sikkim Army Accident,Sikkim Truck,16 Jawans Killed,Rajnath Singh Twitter,Rajnath Singh Son,Rajnath Singh Daughter,Rajnath Singh News,Rajnath Singh Contact Number,Rajnath Singh Family,Rajnath Singh Net Worth,Rajnath Singh Kaun Hai,Rajnath Singh Wife,Deepak Rawat And Rajnath Singh Relationship,Shri Rajnath Singh,Anamika Singh Rajnath Singh

సిక్కింలో ఘోరం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు ఉత్తర సిక్కింలోని భారత్-చైనా సరిహద్దు సమీపంలో లాచెన్ పట్టణంలో ఇండియన్ ఆర్మీ వాహనం పెద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన సైనికులను హెలికాఫ్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. చట్టెన్ నుండి థంగు లోని బోర్డర్ పోస్టుల వైపుకు వెళుతున్న 3 వాహనాల కాన్వాయ్‌లో ఒక వాహనం మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి వందల అడుగుల లోతున్న లోయలోకి నిట్టనిలువుగా జారిపడిందని తెలిపారు. ఈ ఘటన సమయంలో ట్రక్కులో సుమారు 20మంది వరకు ఉన్నారని, ప్రమాద స్థలంలో 16 మృతదేహాలను గుర్తించామని, గాయపడ్డ మరో నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. వీరమరణం పొందిన వారిలో ముగ్గురు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు మరియు 13 మంది సైనికులు ఉన్నారని వివరించారు.

కాగా సిక్కిం ప్రమాద ఘటనపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్న మంత్రి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, వారి సేవ మరియు నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + one =