ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

CM KCR Pays Tribute to Late Actor Kaikala Satyanarayana at Banjara Hills Consoled Family Members,CM KCR Pays Tribute to Late Actor Kaikala Satyanarayana,Many Film And Political Celebrities, Including Prime Minister Modi, Mourned The Death Of Kaikala Satyanarayana,Mango News,Mango News Telugu,Kaikala Satyanarayana Age,Kaikala Satyanarayana Death,Kaikala Satyanarayana Health,Kaikala Satyanarayana Wife,Kaikala Satyanarayana Wikipedia,Kaikala Satyanarayana Cast Name,Kaikala Satyanarayana Son,Kaikala Satyanarayana Is Alive,Telugu Actor Kaikala Satyanarayana,Kaikala Satyanarayana Actor,Kaikala Satyanarayana Kgf,Actor Kaikala Satyanarayana,Actor Kaikala Satyanarayana Age,Kaikala Satyanarayana And Kgf

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. నవరస నటసార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల అనేక అవార్డులు అందుకున్నారని, తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు.

కాగా శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ లోని కైకాల నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్, కైకాల సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, పుష్పాంజలి ఘటించారు. వారి కుమారులను, కూతుళ్లను కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. వారికి ధైర్యవచనాలు చెప్పి కాసేపు పరామర్శించారు. అనంతరం అక్కడే వున్న మీడియా ముందుకు వచ్చి నటుడుగా, ఎంపీగా కైకాలతో తనకున్న అనుబంధాన్ని సీఎం స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు గొప్ప వ్యక్తి. ఈ రోజు వారు మరణించడం చాలా బాధాకరం. సినీ హీరోలతో పోటీపడుతూ చాలా అద్భుతంగా నటించే వారాయన. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో నటించి, అద్భుతమైన పేరు తెచ్చుకున్న వ్యక్తి. నేను కొంతకాలం వారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది. ఆ కాలంలో వారితో కొన్ని అనుభవాలను కూడా పంచుకున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు కైకాల గారిని కోల్పోవడం బాధాకరం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు ఎస్.మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల్క సుమన్ తో పాటు వేణు గోపాలాచారి, దాసోజు శ్రవణ్, ఆంజనేయులు గౌడ్, పతాని రామకృష్ణ గౌడ్, తదితరులున్నారు.

మరోవైపు కైకాల సత్యనారాయణ చేసిన సేవలకు గౌరవంగా, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + six =