ఢిల్లీలో ఆక్సిజన్‌ అందక 20 మంది పేషంట్స్ మృతి

20 Covid-19 patients die, 20 COVID-19 patients die in Delhi Jaipur, 20 Critically Ill Patients Die in Delhi, 20 Critically ill Patients Died Due to Oxygen Shortage, 20 Critically ill Patients Died Due to Oxygen Shortage at Jaipur Golden Hospital in Delhi, 25 patients die due to oxygen shortage, Delhi oxygen shortage, Jaipur Golden Hospital in Delhi, Jaipur Golden Hospital news, Jaipur Golden Hospital oxygen shortage COVID19 patients, Mango News, Oxygen Crisis, Oxygen pressure low, Oxygen shortage

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా చికిత్సలో భాగంగా పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆక్సిజన్ అందక కరోనాకు చికిత్స పొందుతున్న పలువురు బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి ఆక్సిజన్ అందక 20 మంది పేషంట్స్ మరణించారు.

శనివారం ఉదయం జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డికె బలూజా మీడియాతో మాట్లాడుతూ, ఆక్సిజన్ నిల్వలు సరిపడలేవని పేర్కొన్నారు. ఆసుపత్రిలో మరో 200 మందికి ఆక్సిజన్‌ పడకలపై చికిత్స పొందుతున్నారని చెప్పారు. శుక్రవారం సాయంత్రానికే ఆసుపత్రికి 3,600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రావాల్సి ఉండగా, రాత్రి 12 గంటలకు 1,500 లీటర్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. ఆక్సిజన్ 7 గంటలు ఆలస్యంగా రావడంతో కరోనా పేషంట్స్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అలాగే అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరుతూ జైపూర్ గోల్డెన్ ఆసుపత్రి ఢిల్లీ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 2 =