13 ఏళ్ల సర్వీసులో 21 సార్లు బదిలీ.. ఇంతకీ ఆ ఐపీఎస్‌ ఎవరు..?

UP Cadre IPS Officer Prabhakar Chowdhary Who Transferred 21 Times in 13 Years of Service,UP Cadre IPS Officer Prabhakar Chowdhary,IPS Officer Prabhakar Chowdhary,Prabhakar Chowdhary Who Transferred 21 Times,Transferred 21 Times in 13 Years of Service,Prabhakar Chowdhary,Mango News,Mango News Telugu,IPS who was transferred 21 times,21 Transfers in 13 Years of Service,IPS ,Transferred 21 times in 13 years of service,Maharastra, Ips Officer, Transfers,IPS Officer Prabhakar Chowdhary Latest News,IPS Officer Prabhakar Chowdhary Latest Updates,IPS Officer Prabhakar Chowdhary Live News

ఏ పోలీసు అధికారినైనా బదిలీ చేయడం మామూలే. కానీ.. ప్రస్తుతం ఐపీఎస్ అధికారి ప్రభాకర్ చౌదరి బదిలీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన గత 13 ఏళ్లలో 21 సార్లు బదిలీ అయ్యారు. UP క్యాడర్ 2010 బ్యాచ్‌కు చెందిన చురుకైన IPS అధికారి ప్రభాకర్ చౌదరి. ధైర్యవంతులైన అధికారుల్లో ఐపీఎస్ ప్రభాకర్ చౌదరి ప్రథమ స్థానంలో ఉంటారు. సమర్థవంతమైన నాయకత్వానికి, సరళతకు, నిజాయతీకి, కఠిన క్రమశిక్షణకు, నిందితులపై వేగంగా చర్యలు తీసుకోవటంలో పేరు గాంచారు. అయినా తక్కువ వ్యవధిలో అత్యంత ఎక్కువ బదిలీలు చూశారు. గత 4 నెలలుగా బరేలీ జిల్లా కమాండ్‌గా ఉంటున్న ప్రభాకర్‌ చౌదరి…బదిలీ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ IPS అధికారి ప్రభాకర్ చౌదరి ఎవరో తెలుసుకుందాం…

ప్రభాకర్ చౌదరి.. 2010లో IPS క్రమశిక్షణ పూర్తి చేశారు. శిక్షణా కాలంలో అద్భుతమైన, కఠినమైన పనులు చేస్తూ పేరుతెచ్చున్నారు.. గత 13 ఏళ్ల సర్వీసులో 21 సార్లు బదిలీ కావడానికి ఇదే కారణం. ఈ మధ్య విడుదల చేసిన 14 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. బరేలీలోని కవాండీలపై స్వల్ప లాఠి ఛార్జ్ చేయడం వల్లే ఆయన తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని పలువురు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన 4 గంటల వ్యవధిలోనే ఆయన బదిలీ అయ్యారు. ఆయన్ని కమాండెంట్ 32వ కార్ప్స్ పీఏసీ లక్నోకు బదిలీ చేశారు. ఆయన బదిలీపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జోగినవాడలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న దిగ్గజ ఐపీఎస్ అధికారి ఎస్‌ఎస్పీ ప్రభాకర్ చౌదరి.. ఆయన బదిలీపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. ఐపీఎస్ అధికారి ప్రభాకర్ చౌదరి బరేలీ ఎస్‌ఎస్‌పీ నుంచి పీఏసీకి బదిలీ అయిన తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచారు. నగరంలోని అనధికార మార్గంలో ఊరేగింపు చేసేందుకు కన్వారియాలను అనుమతించడానికి నిరాకరించారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడ హింసకు దారితీసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =