భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జనవరికి వాయిదా

51st Edition of International Film Festival, 51st Edition of International Film Festival of India Postponed, IFFI postponed to January 2021, India, International Film Festival, International Film Festival News, International Film Festival of India, International Film Festival of India Postponed, International Film Festival of India postponed to 2021, International Film Festival Postponed, International Film Festival Postponed News

51 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) వాయిదా పడింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 20 నుంచి 28 వరకు నుండి గోవాలో జరగాల్సి ఉంది. అయితే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో చర్చించిన తరువాత ఫిల్మ్ ఫెస్టివల్ ను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ గురువారం నాడు ప్రకటించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచార, ప్రసారాల శాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ను అన్ని కోవిడ్ మార్గదర్శకాలు మరియు ప్రోటోకాల్స్ పాటించి జనవరి 16, 2021 నుండి జనవరి 24, 2021 వరకు గోవాలో నిర్వహించాలని సంయుక్తంగా నిర్ణయించినట్టు మంత్రి జవడేకర్ తెలిపారు. ఈ ఫెస్టివల్ ను హైబ్రిడ్ ఫార్మాట్ లో వర్చువల్ మరియు ఫిజికల్ గా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =