ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

71st Republic Day, 71st Republic Day Celebrations, 71st Republic Day Celebrations In Delhi, latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2020, national political news 2020
దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌పథ్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరపు గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారో ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. వేడుకల్ సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన 41 ఎయిర్ క్రాఫ్ట్స్ చేసిన పదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పోలీసులు మరియు పారా మిలటరీ దళాల రెజిమెంట్లు రాజ్‌పథ్ మైదానంలో చేసిన కవాతు ఆకట్టుకుంది. అలాగే భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా వివిధ మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శకటాల ప్రదర్శన వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి కనుల విందుగా నిలిచింది. మహిళా బైకర్లు అబ్బురపరిచే విన్యాసాలు కూడా అలరించాయి.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =