8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం

8 states get new Governors, Bandaru Dattatreya, Centre appoints new governors to 8 states, Eight states get new governors, Kambhampati Hari Babu as Governor of Mizoram, New Governors Appointed for 8 States, New Governors appointed in 8 states, President Appoints 8 New Governors For These States, President appoints new Governors for 8 states, President Kovind appoints new Governors, President Kovind appoints new Governors for 8 states, President of India appoints new Governors,mango news

దేశంలో 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త గవర్నర్లను నియమించడంతో పాటుగా ప్రస్తుతం పదవిలో ఉన్నవారిని మరో రాష్ట్రానికి బదిలీ చేశారు. మిజోరాం గవర్నర్ గా ఉన్న పిఎస్ శ్రీధరన్ పిళ్ళైను గోవా గవర్నర్‌ గా, హర్యానా గవర్నర్ గా ఉన్న సత్యదేవ్ నారాయణ్ ఆర్యను త్రిపుర గవర్నర్‌ గా, త్రిపుర గవర్నర్ గా ఉన్న రమేష్ బైస్‌ ను జార్ఖండ్ గవర్నర్‌ గా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్‌ గా బదిలీ చేశారు.

మరోవైపు కర్ణాటక గవర్నర్‌ గా తావర్‌ చంద్ గెహ్లాట్‌ ను, మిజోరం గవర్నర్‌ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత కంభంపాటి హరిబాబును, మధ్యప్రదేశ్ గవర్నర్‌ గా మంగూభాయ్ చాగన్‌ భాయ్ పటేల్‌ ను, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ ను నియమించారు. ఈ గవర్నర్ల నియామకంపై రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఓవైపు కేబినెట్ విస్తరణపై వార్తలు వస్తుండగా, దేశంలో పలురాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =