నన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు, నాపై పెట్టింది ఫేక్ కేసు – ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

AAP Leader Delhi Deputy CM Manish Sisodia Reaches CBI Office for Questioning in the Delhi Excise Policy Case, Fake Case Has Been Filed Against Me Manish Sisodia, CBI Summons Delhi Deputy CM Manish Sisodia, Delhi Excise Policy Scam, Delhi Deputy CM Manish Sisodia, Mango News, Mango News Telugu, TRS MLC Kavitha, TRS MLC Kavitha Delhi Liqour Scam Case, Delhi Liquor Scam, Delhi Liquor Scam ED Rides, Delhi Liquor Scam Ed Raids In Telangana, Ed Raids In Telangana, Enforcement Directorate Hyd, Enforcement Directorate, Delhi Liqour Scam, Delhi Liqour Scam Case, Delhi Excise Policy Scam News And Latest Updates

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం శనివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సీబీఐ కార్యాలయాన్ని వెళ్లే ముందు మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తనను అరెస్ట్ చేసే అవకాశముందని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. “నాపై పూర్తిగా ఫేక్ కేసు బనాయించి అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారానికి గుజరాత్ వెళ్లాల్సి ఉంది. గుజరాత్ ఎన్నికల ప్రచారానికి నన్ను వెళ్లకుండా చేయడమే వారి ఉద్దేశం” అని మనీష్ సిసోడియా అన్నారు.

నేను గుజరాత్‌కు వెళ్లినప్పుడు, గుజరాత్‌లో కూడా మీ పిల్లలకు ఢిల్లీ లాంటి అద్భుతమైన పాఠశాలలు నిర్మిస్తామని అక్కడి ప్రజలకు చెప్పాను. ప్రజలు చాలా సంతోషించారు. అయితే కొందరు గుజరాత్‌లో కూడా మంచి పాఠశాలలు నిర్మించాలని కోరుకోవడం లేదు, గుజరాత్ ప్రజలు కూడా చదువుకుని అభివృద్ధి చెందాలి. కానీ నేను జైలుకు వెళ్లడం గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని ఆపలేదు. నేడు ప్రతి గుజరాత్ బిడ్డ ఇప్పుడు మంచి పాఠశాలలు, ఆసుపత్రులు, ఉద్యోగాలు, విద్యుత్ కోసం ప్రచారం చేస్తున్నాడు. గుజరాత్‌లో వచ్చే ఎన్నికలు ఒక ఉద్యమంలా మారనున్నాయి. నాపై పూర్తిగా తప్పుడు కేసు పెట్టారు. మా ఇంట్లో రైడ్ చేసినా ఏమీ కనిపించలేదు, నా బ్యాంక్ లాకర్లన్నింటినీ చెక్ చేశారు, ఏమీ కనిపించలేదు, మా గ్రామానికి వెళ్లి ప్రతిదీ తనిఖీ చేశారు, ఏమీ కనిపించలేదు. ఈ కేసు పూర్తిగా ఫేక్” అని మనీష్ సిసోడియా పేర్కొన్నారు.

మనీష్ సిసోడియా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకై సీబీఐ కార్యాలయానికి వెళ్లడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, “డిసెంబర్ 8న గుజరాత్ ఫలితాలు వెలువడనున్నాయి. కొంతమంది మనీష్‌ను అప్పటి వరకు జైల్లో ఉంచుతారు. దీని ఫలితంగా మనీష్ గుజరాత్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లడం లేదు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =