ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. రెండో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ రఫెల్ నాదల్‌ ఓటమి, టోర్నీనుంచి ఔట్

Australian Open 2023 Defending Champion Rafael Nadal Crashes Out After Loses Straight Sets in 2nd Round,Australian Open 2023,Defending Champion Rafael Nadal,Crashes Out After Loses Straight Sets,2nd Round,Mango News,Mango News Telugu,Australian Open Draw 2023,Tennis Australian Open 2023,Nadal Australian Open 2023,Nadal,Australian Tennis Open 2023 Tickets,Australian Tennis Open 2023 Schedule,Australian Tennis Open 2023 Dates,Australian Tennis Open 2023,Australian Open Tennis 2023,Australian Open Qualifying 2023,Australian Open Draw,Australian Open 2023 Streaming,Australian Open 2023 Start Date,Australian Open 2023 Schedule,Australian Open 2023 Players,Australian Open 2023 Highlights,Australian Open 2023 Draw,Australian Open 2023

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్‌, స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్‌కు షాక్ తగిలింది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు మెకెంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో ఓటమి చెందాడు. 6-4, 6-4, 7-5 తేడాతో స్ట్రెయిట్ సెట్‌లను కోల్పోవడంతో రఫెల్ నాదల్ ఏకంగా టోర్నీనుంచే వైదొలిగాడు. దీంతో 23వ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకోవాలన్న నాదల్‌ కల నెరవేరలేదు. అయితే టోర్నీకి ముందే గాయపడిన రఫెల్ పోరాడినప్పటికీ 65వ ర్యాంక్‌లో ఉన్న మెకెంజీ చేతిలో పరాజయం తప్పలేదు. తుంటి గాయం కారణంగా ఆటలో నాదల్ కోర్టులో చురుకుగా కదలలేకపోయాడు. ఒకదశలో మెడికల్ టైమ్‌ అవుట్ తీసుకుని కోర్టు నుండి బయటకు వెళ్లి ఫిజియోతో కొద్దిసేపు చికిత్స చేయించుకున్నాడు. అనంతరం తిరిగి ఆడటానికి వచ్చినప్పటికీ నాదల్ శారీరకంగా పూర్తి అలసటగా కనిపించాడు. ఈ క్రమంలోనే మెకెంజీ చేతిలో ఓటమి చవిచూశాడు. దీంతో అభిమానులకు అభివాదం చేస్తూ నిరాశగా కోర్టును వీడాడు.

కాగా 2016లో మెల్‌బోర్న్‌లో 45వ ర్యాంక్‌లో ఉన్న ఫెర్నాండో వెర్డాస్కోతో జరిగిన తొలి రౌండ్‌లో ఓడిపోయిన తర్వాత, మళ్ళీ నాదల్ మరో గ్రాండ్‌స్లామ్‌లో రెండో రౌండ్‌లో నిష్క్రమించడం ఇదే కావడం గమనార్హం. ఇక నాదల్ ప్రస్తుతం నంబర్ 2 ర్యాంక్‌లో ఉండగా.. నంబర్ 1 స్థానంలో కార్లోస్ అల్కరాజ్ ఉన్నాడు. గత జూన్‌లో ఫ్రెంచ్ ఓపెన్‌ని గెలుచుకునే క్రమంలో నాదల్‌ ఎడమ పాదానికి గాయమైంది. అలాగే గత జూలైలో వింబుల్డన్ నుండి సెమీఫైనల్స్‌కు ముందు పొత్తికడుపు కండరాల గాయంతో మరోసారి టోర్నీ నుంచి వైదొలిగాడు. అయితే నాదల్‌పై విజయం సాధించిన 27 ఏళ్ల మెకెంజీ మెక్‌డొనాల్డ్ ఒక ప్రధాన టోర్నమెంట్‌లో ఎప్పుడూ నాలుగో రౌండ్‌ను దాటకపోవడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − four =