అమెరికా డ్రోన్ దాడిలో అల్‌ఖైదా చీఫ్ ‘అల్‌ జవహరి’ మృతి.. ధృవీకరించిన అధ్యక్షుడు జో బైడెన్‌

Al Qaeda Chief Ayman al-Zawahiri Ruined in US Drone Attack in Afghanistan Confirms President Joe Biden, Al Qaeda Chief Ayman Al Zawahiri Killed in US Strike Confirms Joe Biden, Joe Biden Says Al Qaeda Chief Ayman Al Zawahiri Killed in US Strike, Al Qaeda Chief Ayman Al Zawahiri Killed in US Strike, Ayman Al Zawahiri has been killed in a US strike in Afghanistan, US strike in Afghanistan, Al Qaeda Chief Ayman Al Zawahiri, Osama Bin Laden was killed in a US operation in Pakistan in 2011, militant group’s founder Osama bin Laden was killed, militant outfit Chief Ayman Al Zawahiri, US has killed the leader of al-Qaeda, Ayman al-Zawahiri in a drone strike in Afghanistan, US drone strike in Afghanistan, US President Joe Biden, President Joe Biden, Al Qaeda chief Ayman al-Zawahiri was killed in an air strike by the United States, Al Qaeda Chief Ayman Al Zawahiri News, Al Qaeda Chief Ayman Al Zawahiri Latest News, Al Qaeda Chief Ayman Al Zawahiri Latest Updates, Al Qaeda Chief Ayman Al Zawahiri Live Updates, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత ‘అయ్‌మన్ అల్‌ జవహరి’ అల్‌జవహరి హతమైనట్లు అగ్రరాజ్యం పేర్కొంది. ఈ మేరకు అమెరికా బలగాలు చేసిన దాడిలో అతను మరణించినట్లు అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. కాబూల్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఎయిర్‌స్ట్రైక్స్‌ చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టి సమాచారాన్ని పైకి చేరవేశాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికా సైన్యానికి అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి అల్‌ జవహరిని హతమార్చారు.

“అల్‌ఖైదా నేత అల్‌జవహరి హతమయ్యాడు. అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్న వదలం. ఎంతకాలమైనా ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతాం’’ అని బైడెన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బైడెన్ స్పష్టం చేశారు. అల్‌ జవహరి మృతితో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయిన 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని ఆయన అన్నారు. కాగా 2011లో అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హతమైనప్పటి నుండి ఆ సంస్థ కార్యకలాపాలు చూసుకుంటున్న అల్‌ జవహరి తాజా మృతి తీవ్రవాద సంస్థకు అతిపెద్ద దెబ్బ అని అమెరికా అధికారులు తెలిపారు. అతని తలపై $25 మిలియన్ల బహుమతి ఉన్నట్లు వారు గుర్తు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 2 =