ప్రవక్తపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ తీవ్రవాద సంస్థ అల్‌కాయిదా.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక

Al-Qaeda Threatens For Attacks on Sacked BJP Leaders Comments Over Prophet, Attacks on Sacked BJP Leaders Comments Over Prophet, Al-Qaeda Threatens For Attacks on Sacked BJP Leaders Comments, Prophet remark, Al-Qaeda threatens suicide attacks, Al-Qaeda in Indian subcontinent threatens to attack India after Prophet remark, Al-Qaeda threatens suicide attacks over sacked BJP leaders remarks on Prophet, Al-Qaeda threatens suicide attacks over sacked BJP leaders on Prophet remark, Al-Qaeda threatens suicide attacks in Gujarat, Al-Qaeda threatens suicide attacks in UP, Al-Qaeda threatens suicide attacks in Mumbai, Al-Qaeda threatens suicide attacks in Delhi, Al-Qaeda, Prophet remark News, Prophet remark Latest News, Prophet remark Latest Updates, Prophet remark Live Updates, Mango News, Mango News Telugu,

మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక ముస్లిం దేశాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జాబితాలోకి ఉగ్రవాద సంస్థ ఆల్‌కాయిదా కూడా చేరింది. ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని, దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని ఆల్‌కాయిదా హెచ్చరిక చేసింది. అలాగే దీనికి ముందుగా ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని హతమారుస్తామని స్పష్టం చేసింది. భారత్ లో అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ గుజరాత్, ఉత్తరప్రదేశ్, ముంబై మరియు ఢిల్లీలలో ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ బెదిరించింది.

ఈ మేరకు ఒక లేఖ విడుదల చేసింది. అందులో ‘మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లోని వారు, చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’ అని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ముస్లింల హృదయాలు రక్తమోడుతున్నాయని, మరియు ప్రతీకార భావాలతో నిండిపోయాయని లేఖలో పేర్కొంది. మరో ఉగ్ర సంస్థ ఎంజీహెచ్‌ కూడా ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ నూపుర్‌ శర్మ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే, ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’ అంటూ తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు సస్పెండ్ చేయబడిన బిజెపి అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్టు చేయాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేయడంతో భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న స్థాయి నిరసనలు చెలరేగాయి. కాగా ఈ గొడవకు కారణమైన పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మరియు నవీన్ కుమార్ జిందాల్ ఇద్దరినీ బీజేపీ సస్పెండ్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =