అమెరికా మాజీ అధ్యక్షుడికి మరో బిగ్ షాక్..

Another Big Shock For The Former President Of America, Another Big Shock For The President, Big Shock For The America President, America President Big Shock, America President, Donald Trump, America EX President Donald Trump, America, America President Elections, America Elections, Latest America President Elections News, World News, Mango News, Mango News Telugu
Donald trump, America EX President Donald trump, America, America President Elections

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్న వేళ ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కొలరాడో కోర్టు.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఏం చేయాలో అర్థకాని పరిస్థితిలో ట్రంప్ ఉండగా.. ఇలానే మరో కోర్టు ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇవ్వడం సంచలనంగా మారింది.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో.. ఆయన మద్ధతుదారులు రగిలిపోయారు. ట్రంప్ ఓటమికి ప్రధాన కారణం ఎన్నికల కమిషనేనని ఆరోపించారు. ఈ మేరకు యూఎస్ పార్లమెంట్ భవనంపై ట్రంప్ మద్ధతుదారులు దాడి చేశారు. పెద్ద ఎత్తున వీరంగం సృష్టించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడి వెనుక ట్రంప్ హస్తం ఉందని ముందు నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్‌పై కేసులు కూడా నమోదయ్యాయి.

వచ్చే ఏడాది మార్చి 5న రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడని ఇటీవలే కొలరాడో కోర్టు ప్రకటించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారన్న వాదనకు బలం చేకూరేలా తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా రాజ్యాంగంలోని 14 సవరణ సెక్షన్ 3 ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేసింది. అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థి నేతపై కోర్టు అనర్హత వేటు వేయడం అమెరికా చరిత్రలోనే ఇదే మొదటిసారి.

ఈసమయంలో ట్రంప్‌కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ట్రంప్ పోటీకి అనర్హుడని మైనే స్టేట్ ప్రకటించింది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మేనే స్టూట్ తరుపున పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ మైనే రాష్ట్ర కార్యదర్శి షెన్న బెల్లోస్ వెల్లడించారు. క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో ట్రంప్ హస్తం ఉందని.. ఆ భవనంపై దాడి చేయాలని మద్ధతుదారులను ట్రంపే కోరారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్న అన్ని దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి.

అయితే ఇప్పుడు ట్రంప్ ముందు ఉన్న ఒకే ఒక్క దారి సుప్రీంకోర్టుకు వెళ్లడం. అక్కడ ట్రంప్‌కు ఊరట కలిగితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. లేదంటే ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే అవుతుంది. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టాలన్న ట్రంప్ ఆశలన్నీ నిరాశలవుతాయి. మరి సుప్రీం కోర్టులో అయినా ట్రంప్‌కు ఊరట కలుగుతుందా..? లేదా..? అనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 17 =