బసకు ఇబ్బంది పడితే ఏం చేయాలి?

Are You Going To Ayodhya Ramaya Darshan, Are You Going To Ayodhya, Ram Mandir, Ayodhya Ramaya Darshan, The Ticket Charge For Going To Ayodhya, Come To Ayodhya, Pray To Rama, Latest Ayodhya Ramaya Darshan News, Ayodhya News, Latest Ayodhya News Update, Sri Rama, Modi, Mango News, Mango News Telugu
Ram Mandir,Ayodhya Ramaya Darshan,The ticket charge for going to Ayodhya, come to Ayodhya, pray to Rama

సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడు పుట్టిన పుణ్యభూమి.. అయోధ్య. వందల ఏళ్ల చరిత్ర కలిగిన అయోధ్యలో.. అభినవ రామమందిర నిర్మాణం పూర్తయి..ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయింది. జనవరి 22న ఆలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ట వేడుకలకు.. ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా నిర్వహించే ఈ వేడుకను కనులారా దర్శించుకోవడానికి  ఇప్పటికే వేల మందికి  ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.

వీవీఐపీలు, వీఐపీలతోపాటు సామాన్య భక్తులకు కూడా రామమంది ప్రారంభోత్సవ ఆహ్వాన లేఖలు అందడంతో చాలా మంది జనవరి 22 నాటికి అయోధ్య వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొంతమంది విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్య వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

జనవరి 22న భక్త జనం ఇబ్బందులు పడకుండా కేవలం ఆరోజు ఆహ్వానాలు అందిన వాళ్లు మాత్రమే రావాలని ఇప్పటికే ప్రకటించారు. దీంతో 22 తర్వాత అయోధ్యకు వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని , ట్రావెల్ ఖర్చు ఎంత అయినా పర్వాలేదని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మేక్ మై ట్రిప్, థామస్‌ కుక్, ఎస్‌ఓటీసీ వంటి  ట్రావెల్‌ కంపెనీలు చెబుతున్నాయి.

జనవరి 22న నిర్వహించే ప్రారంభోత్సవానికి ఏడు వేల మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఆ తర్వాతి రోజు కూడా అయోధ్య వెళ్లడానికి చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు.దీంతో సందిట్లో సడేమియాలా  ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి అయోధ్యకు వెళ్లే విమాన టికెట్ల ధరలను విమానయాన సంస్థలు  పెంచేశాయి. అయోధ్యకు వెళ్లడానికి వన్ సైడ్ టికెట్ రూ.20 వేల నుంచి రూ.30 వేలకు చేరుకున్నాయి.

మేక్‌ మై ట్రిప్‌ ట్రావెల్‌ సంస్థ.. అయోధ్య వెళ్లడానికి ఫ్టైట్ టికెట్ చార్జ్‌ రూ.17,900 నుంచి రూ.24,600 వసూలు చేస్తోంది. జనవరి 21 వ తేదీకి నాన్‌స్టాప్‌ విమానాల ధర రూ.20,699గా ఉంది. జనవరి 20న కోల్‌కతా నుంచి అయోధ్యకు ఫ్టైట్ టికెట్ చార్జ్‌ రూ.18,456 నుంచి రూ.25,761గా ఉంది. బెంగళూరు నుంచి అయోధ్యకు జనవరి 20న రూ.23,152 నుంచి రూ.32,855 వరకు ఫ్టైట్ టికెట్ చార్జ్‌ ఉంది. అయితే ఈనెల 22 తర్వాత  మూడు నుంచి ఐదు లక్షల మంది ప్రతీరోజు అయోధ్యకు వచ్చి రామయ్యను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలోని హోటళ్లన్నీ ఎప్పుడో బుక్‌ అయిపోయాయి. హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ రేటు కూడా 80 నుంచి 100 శాతానికి చేరుకుంది.అటు హోటల్ యాజమాన్యం కూడా హోటల్ రూమ్స్ అద్దెను అమాంతం పెంచేసాయి. దీంతో  అయోధ్యకు వచ్చే  భక్తులు పగటిపూట అయోధ్యలో ఉంటూ, రాత్రి లక్నో లేదా ప్రయాగ్‌రాజ్‌లో స్టే చేయడానికి  ప్లాన్‌ చేసుకోవడం మంచిదంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + four =