ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం.. రేపు ఉదయం 9 గంటలకు లాంచ్ చేయనున్న ఇస్రో

Countdown Begins For The Launch of ISRO's LVM3 Rocket Carrying OneWeb India-2 Satellites,Countdown Begins For The Launch of ISRO LVM3 Rocket,LVM3 Rocket Carrying OneWeb India 2 Satellites,ISROs LVM3 Rocket Launch,Mango News,Mango News Telugu,ISRO Begins Countdown For Launch,ISRO to Launch LVM3 Rocket,Countdown for LVM3,OneWeb India-2 Rocket Launch,ISRO Latest News,ISRO LVM3 Live Updates,ISRO LVM3 Rocket Latest Updates,OneWeb India 2 Satellites News

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శాస్త్రవేత్తలు ఆదివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఎల్వీఎం–3 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ మేరకు ఎల్‌వీఎం3-ఎం3 వాహక నౌక ద్వారా 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. అయితే సాధారణంగా చేపట్టే 24 గంటల కౌంట్‌డౌన్ కు బదులుగా ఈసారి 24 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్ ను ఆరంభించింది ఇస్రో. కాగా దీనికిముందు గురువారం నిర్వహించిన రిహార్సల్స్‌ విజయవంతం అయ్యాయి. దీంతో రేపు ఉదయం ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ డిపార్ట్‌మెంట్‌ స్పేస్ సంస్థలతో కలిసి ఇస్రో దీనిని చేపడుతోంది. ఇక ప్రయోగంలో భాగంగా మొదటి విడతలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా మరో 36 ఉపగ్రహాలను ఎల్‌వీఎం-3 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. 5,805 కేజీలు బరువు కలిగి ఉన్న 36 ఉపగ్రహాలను 450 కి.మీ. ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు. ఇక ఇస్రో ఈ ప్రయోగాన్ని 20 నిమిషాల వ్యవధిలోపే పూర్తి చేసేలా రూపొందించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here