భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం, మే 15 వరకు అమలు

Australia, Australia Banned Passenger Flights from India Until May 15th, Australia Banned Passenger Flights from India Until May 15th Amid Surge in Covid-19 Cases, Australia bans all direct passenger flights, Australia bans all direct passenger flights from India, Australia bans direct passenger flights from India, Australia bans flights from India, Australia bans passenger flights, Australia Bans Passenger Flights From India, Australia suspends direct passenger flights, Australia suspends flights connecting India, COVID 19 Crisis, Covid-19 Effect, India Covid crisis, Mango News, Surge in Covid-19 Cases

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే, యుఎఇ, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా కూడా చేరింది. భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ఒక ప్రకటన చేశారు. భారత్ నుంచి వచ్చే ప్యాసింజర్ విమాన‌ సర్వీసులపై మే 15 వరకు నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా తీసుకున్న తాజా నిర్ణ‌యంతో ఐపీఎల్‌ లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌తో పాటుగా, ఆ దేశ‌స్థులు కూడా కొన్నిరోజుల పాటుగా భారత్‌ లోనే ఉండిపోవాల్సి ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 5 =