ఏపీలో కొత్త నిబంధనలు: ప్రజా రవాణా, థియేటర్స్ 50 శాతం సామర్ధ్యంతోనే అనుమతి

Additional Restrictions to Handle the Rise in Covid-19 In AP, Andhra Pradesh, Andhra Pradesh Additional Restrictions to Handle the Rise in Covid-19, Andhra Pradesh Government, Andhra Pradesh ready to face second Covid wave, AP COVID 19 Cases, AP Govt Issued Additional Restrictions to Handle the Rise in Covid-19 Cases, AP Restrictions to Handle the Rise in Covid-19 Cases, Coronavirus Updates, Mango News, Restrictions to Handle the Rise in Covid-19 Cases In AP

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసొలేషన్, కరోనా బాధితులకు చికిత్స అందించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం, కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రంలో అమల్లో ఉన్న నిబంధనలకు కొనసాగింపుగా అదనంగా మరిన్ని నిబంధనలు అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఇవే:

  • అన్ని జిమ్స్, స్పాస్, క్రీడా ప్రాంగణాలు వెంటనే మూసివేయాలని నిర్ణయం.
  • అన్ని సమావేశాలు, సమ్మేళనాలు, వివాహాలు ఇలా ఏ వేడుకకైనా 50 మందికే అనుమతి. వీటికి హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి అన్ని కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు.
  • అంత్యక్రియలు, సంబంధిత కార్యక్రమాలకు కరోనా నిబంధనలకు అనుగుణంగా 20 మందికే అనుమతి.
  • ప్రజా రవాణా 50 శాతం సామర్ధ్యంతోనే అనుమతి. అలాగే ప్రజా రవాణాలో నిలబడి ప్రయాణించకూడదు.
  • సినిమా థియేటర్లకు 50 శాతం సామర్ధ్యంతోనే అనుమతి.
  • ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో సిబ్బంది మధ్య తప్పనిసరిగా 5 అడుగుల దూరం పాటించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =