మే 3 నుంచి వీసా సేవలను రద్దు చేసిన యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్

Hyderabad, Hyderabad US Consulate to cancel visa services, Mango News, US Consulate General, US Consulate General Hyderabad, US Consulate General Hyderabad Cancels all Routine Visa Services, US Consulate General Hyderabad Cancels all Routine Visa Services from May 3, US Consulate General Hyderabad closes all routine services, US Consulate in Hyd cancels visa services, US Consulate in Hyderabad cancels visa services, US visa services cancelled, US visa services cancelled from May 3

ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సాధారణ వీసా సేవలు మే 3 వ తేదీ నుండి తదుపరి నోటీసు వచ్చేంత రద్దు చేయబడ్డాయని ప్రకటించింది. అలాగే అన్ని సాధారణ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్స్‌, ఇంటర్వ్యూ వీవర్ అపాయింట్‌మెంట్స్‌ కూడా రద్దు చేయబడ్డాయని చెప్పారు.

ఇక అన్ని సాధారణ అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్స్‌ ఏప్రిల్ 27 నుండి తదుపరి నోటీసు వరకు రద్దు చేయబడతాయని పేర్కొన్నారు. అయితే స్థానిక పరిస్థితులు అనుమతించే మేరకు అత్యవసర అమెరికన్ సిటిజన్ సేవలు మరియు వీసా నియామకాలు కొనసాగుతాయని, ఈ సమయంలో ఇప్పటికే షెడ్యూల్ చేసిన అత్యవసర అపాయింట్‌మెంట్స్‌ను కొన‌సాగించేందుకు తాము అన్ని విధాల‌ ప్రయత్నం చేస్తామని యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ మంగళవారం నాడు ప్రకటించింది.

.మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =