బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టు వేదిక ధర్మశాల నుంచి ఇండోర్‌ కు మార్పు

Australia Tour of InAustralia Tour of India for Border-Gavaskar Trophy: BCCI Announces Venue for 3rd Test Shifted to Indore from Dharamshala,Border Gavaskar Trophy Streaming,Border Gavaskar Trophy 2023 Venue,Border-Gavaskar Trophy 2023,Mango News,Border-Gavaskar Trophy Series,Border-Gavaskar Trophy History,Border-Gavaskar Trophy Squad,Border-Gavaskar Trophy Winners List,Border-Gavaskar Trophy Schedule,Border Gavaskar Trophy,Border Gavaskar Trophy 2018,Border Gavaskar Trophy 2020-21,Border Gavaskar Trophy Winners List,Border Gavaskar Trophy 2014,Border Gavaskar Trophy Documentary,Border Gavaskar Trophy 2001,Border Gavaskar Trophy 2017,Border Gavaskar Trophy 2021 Scorecard,Next Border Gavaskar Trophy,2001 Border Gavaskar Trophy,Ind Vs Aus Border Gavaskar Trophy 2020,2004 Border Gavaskar Trophy,Most Runs In Border Gavaskar Trophydia for Border-Gavaskar Trophy: BCCI Announces Venue for 3rd Test Shifted to Indore from Dharamshala

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన తోలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 2వ టెస్టు ఫిబ్రవరి 17-21 తేదీలలో మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో, 3వ టెస్టు మార్చి 1-5 వరకు ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో, 4వ టెస్టు మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు షెడ్యూల్ ప్రకటించారు. కాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన మూడో టెస్టు వేదికను ధర్మశాల నుంచి ఇండోర్‌ కు మారుస్తునట్టుగా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఔట్‌ఫీల్డ్‌ సిద్ధంగా లేకపోవడమే వేదిక మార్పుకు కారణమని బీసీసీఐ తెలిపింది.

“బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా, ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన మూడో టెస్టు ఇప్పుడు ఇండోర్‌ లోని హోల్కర్ స్టేడియంకు మార్చబడింది. ధర్మశాల ప్రాంతంలో కఠినమైన శీతాకాల పరిస్థితుల కారణంగా, అవుట్‌ఫీల్డ్‌లో తగినంత గ్రాస్ డెన్సిటీ లేదు మరియు పూర్తిగా అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది” అని బీసీసీఐ పేర్కొంది. ముందుగా మూడో టెస్టు మ్యాచ్ ను విశాఖపట్నం లేదా బెంగళూరుకు తరలించే అవకాశమున్నట్టు వార్తలు రాగా, చివరికి ఇండోర్ వేదికను ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =