రేపటి నుంచి 5 రోజుల పాటు బ్యాంకులు బంద్

Bank Holidays, bank Holidays news,Banks To Remain Closed For 5 Days From Tomorrow Onwards, Banks to remain closed, Banks to remain closed For 5 Days, 5 Days, Banks Closed, Remain Closed For 5 Days, Bank HoliDays, HoliDays For Banks, 5 Days HoliDays For Banks, Banks, Banks Latest News, Banks Latest Updates, Banks Live Updates, Mango News, Mango News Telugu,

బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొనే సంక్రాంతి పండగతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల సందర్భంగా.. మంగళవారం (జనవరి 11) నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవులు మారుతుంటాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే బ్యాంక్ సెలవులు జాబితాను వెబ్ సైట్ లో ప్రకటించింది. ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం జనవరి నెలలో 16 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికే కొన్ని హాలిడేస్ అయిపోయాయి. ఈ క్రమంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుపుకొనే వివిధ పండగల కారణంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవులు మారుతాయి.

ఉదాహరణకు, రెండు తెలుగు రాష్ట్రాలలో జనవరి 14వ తేదీన భోగి, జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి వలన బ్యాంకులకు సెలవు. జనవరి 16వ తేదీన ఆదివారం సెలవు. అలాగే, తమిళనాడు రాష్ట్రంలో.. థాయ్ పూసం మురుగన్ జయంతి, తిరువళ్లువర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కానీ అసోం రాష్ట్రంలో అదే రోజు బ్యాంకులు పనిచేస్తాయి. జనవరి 11వ తేదీన మిషనరీ డే, జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అలా రాష్ట్రాన్ని బట్టి బ్యాంకుల సెలవులు మారుతూ ఉంటాయి. జనవరి 11,12,14,15,16 తేదీల్లో ఐదురోజుల పాటు సెలవుల వల్ల కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. కానీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 2 =