టెన్నిస్‌ స్టార్‌ నోవాక్ జకోవిచ్ కు ఆస్ట్రేలియా కోర్టులో ఊరట

Australia Court Reinstates Tennis Star Novak Djokovic’s Visa, Orders Release From Detention Centre, Australia Court, Australia Court Reinstates Tennis Star Novak Djokovic’s Visa, Reinstates Tennis Star Novak Djokovic’s Visa, Tennis Star Novak Djokovic wins court case, Novak Djokovic court case, Djokovic wins court case, Djokovic wins court battle to stay in Australia, Australian minister, Novak detention in Australia, Australian judge reinstates, Court Rules In Favor Of Djokovic, Mango News, Mango News Telugu,

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్, సెర్బియా టెన్నిస్‌ స్టార్‌.. నోవాక్ జకోవిచ్ కు ఆస్ట్రేలియా కోర్టు ఊరటనిచ్చింది. అతడికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. విచారణ అనంతరం అతడిని వెంటనే క్వారంటైన్ డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే అతడి వీసాను కూడా పునరుద్ధరించాలని తెలిపింది. ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు.. వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక వైద్య మినహాయింపుతో జొకోవిచ్ ఆస్ట్రేలియా‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో నోవాక్ గత బుధవారం మెల్ బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

అయితే మినహాయింపు పొందడానికి జొకోవిచ్‌ సహేతుక కారణాలు సమర్పించలేదంటూ ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. అంతేగాక, జొకోవిచ్‌ వీసాను కూడా రద్దు చేయడంతో పాటు క్వారంటైన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. దీనిపై జొకోవిచ్‌ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం జొకోవిచ్‌ పిటిషన్‌ను విచారించిన ఫెడరల్‌ సర్క్యూట్, ఆస్ట్రేలియన్‌ ఫ్యామిలీ కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో.. సోమవారం జొకోవిచ్‌ పిటిషన్‌ను విచారించిన ఫెడరల్‌ సర్క్యూట్, ఆస్ట్రేలియన్‌ ఫ్యామిలీ కోర్టు.. అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో జొకోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ బరిలో దిగేందుకు మార్గం సుగమమైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =