త్వరలోనే రష్యన్ రాకెట్లు, ‘నాటో’ దేశాలపై కూడా పడతాయి – ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ హెచ్చరిక

Russian Rockets Will Fall on NATO Soil Warns Volodymyr Zelensky, Volodymyr Zelensky Warns Russian Rockets Will Fall on NATO Soil, NATO Soil, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Crisis, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

త్వరలోనే రష్యన్ రాకెట్లు, ‘నాటో’ దేశాలపై కూడా పడతాయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ హెచ్చరికలు చేశారు. పోలండ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉక్రేనియన్ సైనిక స్థావరంపై వైమానిక దాడి జరిగిన తర్వాత జెలెన్స్కీ ఇలా వ్యాఖ్యానించారు. ‘నాటో’ సభ్యదేశాలు త్వరలోనే రష్యా దళాలచే దాడి చేయబడతాయని హెచ్చరించారు. నా అంచనా ప్రకారం అతి త్వరలోనే రష్యన్ రాకెట్లు నాటో గడ్డపై పడతాయి అని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా తన దళాలు నాటో దళాలతో శిక్షణ పొందిన సైనిక స్థావరంపై దాడి చేయటం కలకలం రేపుతోంది. ఈ ఘోరమైన వైమానిక దాడితో పశ్చిమ ఉక్రెయిన్‌, పోలాండ్ మరియు కూటమిలోని ఇతర సభ్యు దేశాలకు రష్యా హెచ్చరికలు జారీ చేసినట్లయింది.

ఈ దాడిలో ఒక అమెరికా వీడియో జర్నలిస్ట్ ఆదివారం మరణించాడని, అలాగే, మరొక అమెరికన్ జర్నలిస్ట్ గాయపడ్డాడని ఉక్రెయిన్ రాజధాని కైవ్ పోలీసులు ధృవీకరించారు. రష్యా దళాలు ఏడు ఆసుపత్రులను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఆరుగురు వైద్య సిబ్బంది మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రేనియన్ ఆరోగ్య మంత్రి విక్టర్ లియాష్కో తెలిపారు. ఉక్రెయిన్‌లో ఆక్రమణలపై రష్యా వైఖరిని అమెరికా మరోసారి ఖండించింది. ‘పోలాండ్‌తో ఉక్రెయిన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న యావోరివ్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పీస్ కీపింగ్ అండ్ సెక్యూరిటీపై రష్యన్ ఫెడరేషన్ క్షిపణి దాడిని మేము ఖండిస్తున్నాము’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. మరోవైపు అధ్యక్షుడు జో బిడెన్ ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం గురించి చర్చించడానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడారు. రష్యా తన చర్యలకు బాధ్యత వహించాలని వైట్ హౌస్ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 8 =