ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

BCCI Announces India Squads for Last Two Tests of Border-Gavaskar Trophy and ODI Series Announced,BCCI,ODI Series,BCCI Announce India Squad,BCCI Announces Squad For Remaining Test And ODI Series Against Australia,Indian Squad For The Remaining 2 Test Announced,Border Gavaskar Trophy,India Vs Australia,ODI Series 2023,Border-gavaskar Trophy 2023,Border-gavaskar Trophy Story,Border Gavaskar Trophy 2023,Border Gavaskar Trophy Winners List Captain,Cricket,Ind Vs Aus,Cricket News,Cricket Live,Cricket Live News,Cricket Live Updates,Ind Vs Aus Team,Border-Gavaskar Trophy News,Border-Gavaskar Trophy Team,Border-Gavaskar Trophy Live Updates,Border-Gavaskar Trophy Latest Updates,ODI Series,ODI Series Team,ODI Series Team Announced,Rohit Sharma (C),KL Rahul,S Gill,Cheteshwar Pujara,Virat Kohli,KS Bharat (wk),Ishan Kishan (wk),R Ashwin,Axar Patel,Kuldeep Yadav,R Jadeja,Mohd Shami,Mohd Siraj,Shreyas Iyer,Suryakumar Yadav,Umesh Yadav,Jaydev Unadkat

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తోలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించగా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్‌ ప్రస్తుతానికి 2-0 తో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1-5 వరకు ఇండోర్‌ లోని హోల్కర్ స్టేడియం, 4వ టెస్టు మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో చివరి రెండు టెస్టు మ్యాచులకు సంబంధించిన భారత్ జట్టును ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించారు. రంజీ ట్రోఫీ ఫైనల్‌కై సౌరాష్ట్ర కోసం రెండో టెస్టుకు ముందు జట్టు నుండి విడుదలైన జయదేవ్ ఉనద్కత్ తిరిగి టెస్టు జట్టులో చేరాడు. కాగా ఇటీవల టెస్టుల్లో ఆశించిన మేర రాణించని ఓపెనర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ జట్టులో స్థానం దక్కించుకున్నప్పటికీ, టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా తొలగించబడ్డాడు.

ఇక భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 17న ముంబయిలో, మార్చి 19 వైజాగ్ లో, మార్చి 22న చెన్నైలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సిరీస్ జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం కూడా ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ఎంపిక చేసింది. అయితే కుటుంబ కమిట్మెంట్స్ కారణంగా రోహిత్ శర్మ మొదటి వన్డేకు అందుబాటులో ఉండడని, మొదటి వన్డేలో హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ తెలిపింది. అలాగే 10 ఏళ్ల తర్వాత జయదేవ్ ఉనద్కత్‌ కు వన్డే జట్టులో చోటు లభించింది.

ఆస్ట్రేలియాతో జరిగే మూడో, నాలుగో టెస్టుకు భారత్ టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

ఆస్ట్రేలియాతో వన్డేల్లో తలపడే భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 2 =