ఐపీఎల్ టోర్నీ నుంచి గాయాలతో భువనేశ్వర్, అమిత్ మిశ్రా అవుట్

Amit Mishra, Amit Mishra Ruled Out Of IPL With Injuries, Bhuvneshwar Kumar Injury News, Cricketers Bhuvneshwar Kumar, IPL 2020, IPL 2020 Highlights, IPL 2020 Latest Updates, IPL 2020 Live Cricket Score, IPL 2020 LIVE SCORE, IPL 2020 LIVE SCORE And Updates, IPL 2020 Live Updates, IPL 2020 Match 15 Live Score, SRH Bhuvneshwar Kumar and DC Amit Mishra

యూఏఈలో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆటగాళ్లు గాయాలతో లీగ్ నుంచి తప్పుకునే పరిస్థితి రావడంతో ఆయా జట్లకు, అభిమానులకు షాక్ తగిలినట్లైతుంది. గాయాల కారణంగా ఈ ఐపీఎల్ నుంచి భారత సీనియర్‌ క్రికెటర్లు భువనేశ్వర్‌ కుమార్‌, అమిత్‌ మిశ్రా దూరం కానున్నారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ తుంటికి గాయం కాగా, ఓవర్ పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే.

గాయం తీవ్రత నేపథ్యంలో ఈ ఐపీఎల్ సీజన్‌ మొత్తానికి భువనేశ్వర్ కుమార్ దూరం కానున్నట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కాలికి గాయం కావడం వలన మిచెల్ మార్ష్ కూడా జట్టుకు దూరం అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కూడా వేలి గాయంతో ఈ సీజన్ కు పూర్తిగా అందుబాటులో ఉండడని ఢిల్లీ జట్టు యాజమాన్యం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here