బెంగళూరులో ఎమ్మెల్యే ఇంటిపై దాడి: అల్లర్లలో ఇద్దరు మృతి, 60 మందికి గాయాలు

Bangalore MLA Akhanda, Bangalore Riots, Bangalore Riots Today Latest News, Bangalore violence, Bangalore violence latest news, Bangalore Violence Live Update, Bengaluru burns, Bengaluru Riots, Bengaluru Riots 2020

సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు విషయంలో ఆగస్టు 11, మంగళవారం రాత్రి బెంగుళూరు తూర్పు ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. డిజె హళ్లిలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడి జరిగింది. ఎమ్మెల్యే బంధువు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు నేపథ్యంలో వివాదం చెలరేగి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఆ పోస్టు ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ ఆందోళనకారులు ఎమ్మెల్యే నివాసంతో పాటుగా, డిజె హళ్లి పోలీస్ స్టేషన్ పై కూడా రాళ్లతో దాడి చేశారు. అల్లర్లు తీవ్ర స్థాయిలో చెలరేగడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 60 మంది దాకా పోలీసులు కూడా గాయపడినట్టు తెలుస్తుంది.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 110 మందిని అరెస్టు చేసినట్టు బెంగళూరు జాయింట్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఎమ్మెల్యే బంధువును కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డిజె హళ్లి, కేజీ హళ్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించి, 144 సెక్షన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 19 =