భారత్ ‌బయోటెక్‌ “కోవ్యాక్సిన్‌”, మానవులపై ఫేజ్‌-1, ఫేజ్‌-2 ప్రయోగాలకు అనుమతి

Bharat Biotech, Bharat Biotech COVAXIN, Bharat Biotech Covid-19 Vaccine, coronavirus vaccine, Coronavirus Vaccine COVAXIN, COVAXIN, covid 19 vaccine, Covid-19 Vaccine Human Trials, Hyderabad Company Bharat Biotech, India Develops Covid-19 Vaccine, Indian Council of Medical Research, National Institute of Virology

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణ కోసం వివిధ ఫార్మా కంపెనీలు వాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకుంది. “కోవ్యాక్సిన్‌” పేరుతో భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ సంయుక్తంగా తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్‌ ను మానవులపై ఫేజ్‌-1, ఫేజ్‌-2 ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. జూలై నుంచి దేశం అంతటా ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నట్లు భారత్‌ బయోటెక్ కంపెనీ సోమవారం నాడు వెల్లడించింది. కరోనా కట్టడికి దేశంలో తయారవుతున్న తోలి ఔషధం ఇదే కావడం విశేషం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − four =