మణిపూర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీరెన్ సింగ్

Biren Singh to Take Oath as Manipur CM for a Second Term Today, Biren Singh to Take Oath as Manipur CM for a Second Term, Biren Singh Takes Oath as New Chief Minister of Manipur, Biren Singh Takes Oath as New CM of Manipur, New CM of Manipur, Biren Singh, New Chief Minister of Manipur, Biren Singh Takes Charge as New Chief Minister of Manipur, Manipur CM Biren Singh, Manipur Chief Minister Biren Singh, Chief Minister Biren Singh, Manipur CM Biren Singh oath-taking ceremony, Biren Singh oath-taking ceremony, oath-taking ceremony, oath-taking ceremony Latest News, oath-taking ceremony Latest Updates, oath-taking ceremony Live Updates, Bharatiya Janata Party leader Biren Singh was sworn in as the Manipur Chief Minister, Bharatiya Janata Party leader Biren Singh, Biren Singh was sworn in as the Manipur Chief Minister, Bharatiya Janata Party leader, Bharatiya Janata Party leader Singh takes oath as new Manipur CM, new Manipur CM, Mango News, Mango News Telugu,

ఇటీవల జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సత్తా చాటిన సంగతి తెలిసిందే. మణిపూర్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, బీజేపీ 32 స్థానాల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ సాధించింది. ఈ నేపథ్యంలో మార్చి 21, సోమవారం మధ్యాహ్నం మణిపూర్ సీఎంగా ఎన్ బీరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ గవర్నర్ లా.గణేశన్ బీరెన్ సింగ్ చేత ప్రమాణం చేయించారు. మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరయ్యారు.

ముందుగా ఆదివారం నాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలంతా సమావేశమై తమ శాసనసభాపక్ష నేతగా బీరెన్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు మరియు భూపేంద్ర యాదవ్ కూడా పాల్గొన్నారు. మణిపూర్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన పదిరోజుల తర్వాత సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ బీజేపీ 32 స్థానాలు, ఎన్పీపీ 7, జేడీయూ 6, కాంగ్రెస్ 5, ఎన్పీఎఫ్ 5, కుకీ పీపుల్స్ అలయన్స్ 2, ఇండిపెండెంట్స్ 3 స్థానాల్లో విజయం సాధించారు. ఫలితాల అనంతరం బీరేన్ సింగ్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అమిత్ షాలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం మరోసారి బీరెన్ సింగ్ కే మణిపూర్ సీఎంగా అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 16 =