వర్షం వలన ఆగిన ఆట, దెబ్బ ఎవరికీ?

India vs New Zealand Semifinal Match Updates,Mango News,2019 Latest Sport News And Headlines,Latest Cricket News,ICC World Cup 2019 India vs New Zealand Live Score,India Vs New Zealand World Cup 2019 Semi-Final Match Highlights,India vs New Zealand live score over 1st Semi Final ODI,India vs New Zealand Semi-Final Highlights,India vs New Zealand Highlights World Cup 2019 semi-final,ICC World Cup 2019 Semi-Final Match Updates,India vs New Zealand Live Cricket Score
  • వర్షం వలన ఆగిన భారత్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్
  • నేడు ఆట కొనసాగింపు
  • పూర్తిగా రద్దు అయితే, భారత్ నేరుగా ఫైనల్ కి

క్రికెట్ ప్రపంచకప్ 2019 లో నిన్న జరిగిన తోలి సెమీఫైనల్ లో భారత్ జట్టు, న్యూజిలాండ్ తో తలపడింది, ఇంగ్లాండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో ఈ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది, కానీ ఆట 46.1 ఓవర్లు కి చేరుకునేసరికి, వర్షం వలన మ్యాచ్ అర్దాంతరంగా ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 46.1 ఓవర్లు కి ఐదు వికెట్స్ కోల్పోయి 211 పరుగులు చేసింది, దాదాపు నాలుగు గంటలపాటు వర్షం ఆగకుండా పడడంతో అంపైర్లు ఇంకా ఆటని కొనసాగించలేమని తేల్చేశారు. క్రికెట్ ప్రపంచకప్ నిబంధనల ప్రకారం, సెమీఫైనల్ మరియు ఫైనల్ కి రిజర్వ్ డే ఉండడంతో మ్యాచ్ ను బుధవారానికి వాయిదా వేశారు.

భారత్ జట్టుకు టాస్ అనుకూలత లేకపోయినా, భారత్ బౌలర్లు మంచి ప్రదర్శనతో ఆకట్టుకొని, న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసారు. నాలుగో ఓవర్ లోనే బుమ్రా, గుప్తిల్ వికెట్ దక్కించుకోవడంతో న్యూజిలాండ్ జట్టు ఆత్మరక్షణ ధోరణి లో ఆడారు. రవీంద్రజడేజా కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ జట్టు కి 100 పరుగులు చేయడానికి 29 ఓవర్లు పట్టింది. ఆ జట్టులో కెప్టెన్ విలియంసన్ 67 పరుగులు చేసి అవుట్ అవ్వగా, రాస్ టేలర్ 67 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ రోజు నిన్న ఆగిన దగ్గరనుంచి మ్యాచ్ కొనసాగనుంది, ఈ రోజు కూడా వర్ష సూచన ఉండడంతో, డక్ వర్త్ లూయిస్ పద్ధతి వలన భారత్ విజయావకాశాలపై ప్రభావం ఉంటుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒక వేళా ఈ రోజు కూడ వర్షం వలన మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే, ఎక్కువ పాయింట్స్ ఉండటం వలన భారత్ నేరుగా ఫైనల్ కి చేరుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + nineteen =