అంతర్జాతీయ మహిళా దినోత్సవం: శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ

2021 International Women’s Day, International Women’s Day, International Women’s Day 2021, International Women’s Day Celebrations, International Women’s Day News, Mango News, Narendra Modi, PM Modi, PM Modi Conveyed Best Wishes to All the Women, PM Modi Greets Women, PM Modi Greets Women On International Women’s Day, President Kovind, President Kovind Conveyed Best Wishes to All the Women, Prime Minister, Prime Minister Narendra Modi, Womens Day, World Women’s Day

మార్చి 8, సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు. మన దేశంలో మహిళలు వివిధ రంగాలలో కొత్త రికార్డులు, విజయాలు సాధిస్తున్నారు. మహిళలు మరియు పురుషుల మధ్య అసమానతలను తొలగించడానికి మనందరం సమష్టిగా కృషి చేయాలి – రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారిశక్తికి వందనం. మన దేశ మహిళల సాధిస్తున్న విజయాల పట్ల దేశం గర్విస్తుంది. విస్తృత రంగాలలో మహిళా సాధికారతను పెంపొందించే దిశగా పనిచేసే అవకాశాన్ని పొందడం మా ప్రభుత్వానికి గౌరవం – ప్రధాని నరేంద్ర మోదీ

ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అడ్డంకులను, కష్టాలను, అసమానతలను అదిగమిస్తూ ముందుకు సాగుతున్న మహిళల స్పూర్తికి వందనం. మహిళా సాధికారతయే జాతి సాధికారత. కుటుంబానికి, సమాజానికి, దేశాభివృద్ధికి మహిళల సేవా, త్యాగం, కృషి అభినందనీయం – తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి శుభాకాంక్షలు. పురుషునితో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళ తన ప్రతిభను చాటుకుంటుంది. జనాభాలో సగంగా వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది – తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. కుటుంబ సాంప్రదాయం, నేషన్ బిల్డింగ్ మరియు సహనంతో ఎక్కువ బాధ్యతలను భరించడంలో వారు నిర్వివాద నాయకత్వ పాత్ర పోషిస్తారు, ఇది వారికి దేవుడు ఇచ్చిన బహుమతి – ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు. అన్ని అసమానతలను, అవాంఛనీయ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని వివిధ రంగాలలో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళలకు నా వందనం. ఈ రోజున లింగ వివక్షను అంతం చేస్తామని మరియు అందరికీ సమానమైన మరియు సరైన అవకాశాలను అందిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం – ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =